AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. క్షణం ఆలస్యం అయ్యిఉంటే ..

చిన్నపిల్లలు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు తెలిసి తెలియక చేసే పనులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Viral Video: ఈ బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. క్షణం ఆలస్యం అయ్యిఉంటే ..
Viral
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2022 | 7:50 PM

Share

Viral Video: చిన్నపిల్లలు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు తెలిసి తెలియక చేసే పనులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్న పిల్లలు తప్పు మరియు తప్పు అనే తేడా తెలియకపోవడమే కాదు, వారు దేనికీ భయపడరు.మీతో ఎల్లప్పుడూ పెద్దలు ఉండటం అత్యవసరం. కొన్ని సార్లు వాళ్ళు చేసే పనులు ప్రమాదంలోకి నెడుతుంటాయి.  పిల్లలు ఏది చూసినా తీసి నోట్లో పెట్టుకుంటారు. పిల్లలకు ఏది తినదగినదో, ఏది కాదో తెలియదు. మట్టి, చిన్న కీటకాలు, ఏది చూసినా వాటి నోటిలో పెట్టుకుంటుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీరు కూడా ఒక్క క్షణం నివ్వెరపోతారు.

ఈ వీడియోలో ఓ చిన్న పిల్లాడు బతికే ఉన్న బల్లిని పట్టుకుని ఏకంగా నోట్లో పెట్టుకొని తినే ప్రయత్నం చేశాడు. ఈ  వీడియోలో ఓ తల్లి తన బిడ్డతో నిలబడి ఉంది. ఇంతలో అక్కడికి ఎవరో వస్తున్నారు. మీరు ఆ వ్యక్తి చొక్కా మీద ఓ  బల్లిని చూడవచ్చు. తల్లి ఈ చిన్నారికి బతికి ఉన్న బల్లిని చూపిస్తున్నాడు.. బల్లి కదలికలు పసిపాపను ఆకర్షించాయి.  దాన్ని పట్టుకొని వెంటనే నోట్లో పెట్టుకుంటాడు ఆ బుడతడు. అప్రమత్తమైన తల్లి వెంటనే ఆ పిల్లాడి చేతిని నెట్టేస్తుంది. 1 సెకను ఆలస్యమైతే ఆ బుడ్డోడు బల్లిని తినేసేవాడు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది… ఈ వీడియోకి ఇప్పటివరకు 43 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో, 10 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.