కేంద్రాన్ని బదనాం చేసేందుకే మళ్లీ వరి రగడ.. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుః బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం మళ్లీ వరి అంటున్నాడని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.

కేంద్రాన్ని బదనాం చేసేందుకే మళ్లీ వరి రగడ.. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుః బండి సంజయ్
Bandi Sanjay
Follow us

|

Updated on: Mar 20, 2022 | 6:56 PM

Bandi Sanjay Comments: కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం మళ్లీ వరి అంటున్నాడని తెలంగాణ(Telangana) భారతీయ జనతా పార్టీ(BJP) అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం వరి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని.. కొనే బాధ్యతలు మేము తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు వరి వేస్తేనేమో ఉరి.. కేసీఆర్(KCR) వేస్తేనేమో కోటీశ్వరుడు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 14న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడతకు అమిత్ షాను ఆహ్వానించామని.. సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తప్పు చేసి వివాదాలలో పడ్డాడని.. కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పై పాలసీ ఉంటుందని.. ఇండియా గేట్ దగ్గర, బిజెపీ ఆఫీస్ దగ్గర వడ్లు పోయడానికి జేసీబీ లు దొరకడం లేదా అని నిలదీశారు.

ధాన్యం కోనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారన్నారు.. యూపీఏ లో కంటే ఎన్ డీ ఏ ప్రభుత్వం లో రెట్టింపు ధాన్యం కొంటున్నామని పేర్కొన్నారు. దేశంలో వడ్లు కొనుగోళ్లు లో తెలంగాణ రెండో రాష్ట్రంలో ఉందని.. కేంద్రం వడ్లు కొనుగోలు కి 84,120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. వానా కాలం లో 40 లక్షలు మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తో అగ్రిమెంట్ కుదిరిందన్నారు. అయితే, అదనంగా 24 లక్షలు మెట్రిక్ టన్నుల కొంటానని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కి, రా రైస్ కి రైతులు కి ఏమి సంబంధం.. ఇప్పటి వరకు అదనంగా ఇస్తామన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని బండి సంజయ్ మండిపడ్డారు.

కాగా, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో పోలీసుల లాఠీచార్జిపై బండి సంజయ్ స్పందించారు. ఈ వ్యవహారంలో సీపీ తీరుపై మండిపడ్డారు బండి సంజయ్‌. హిందువులపై దాడిని ఖండిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. హిందు యువకులపై రాజకీయ పార్టీలతో కలిసి పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. బోధన్‌లో శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆరు నెలల క్రితమే తీర్మానం చేసిందన్నారు. ఆ తీర్మానం ప్రకారం విగ్రహం పెడితే అడ్డుకుంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాళ్ల దాడి చేయడం మూర్ఖత్వమన్నారు. భైంసాలో జరిగినట్లే.. బోధన్‌లోనూ జరుగుతోందని మండిపడ్డారు.

హిందువులకు తాము అండగా వుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. శివాజీ పాక్ నుంచి లేదా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. శివాజీ విగ్రహం ఎందుకు పెట్టకూడదో పోలీసు కమిషనర్ చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలో సీఎం ఆశీస్సుల కోసం కొందరు ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బోధన్ లో హిందువులపై లాఠీచార్జి ఘటనలో సీపీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శివాజీ విగ్రహాన్ని తొలగించే ప్రసక్తే లేదన్న బండి సంజయ్.. పోలీసు స్టేషన్లు కబ్జాదారులు, గుండాలకు అడ్డాగా మారాయన్నారు.

ఇదిలావుంటే, బోధన్‌‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భోదన్‌లో 144 సెక్షన్‌ విధించారు. అయితే బోధన్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు.

Read Also…

Bodhan Tension: బోధన్‌లో విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!