Bodhan Tension: బోధన్‌లో విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తం
నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాత్రికి రాత్రే శివాజీ విగ్రహ ప్రతిష్ట జరిగింది.
Bodhan Statue Tension: నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాత్రికి రాత్రే శివాజీ విగ్రహ ప్రతిష్ట జరిగింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తెల్లారేసరికి ఓ వర్గం నాయకులు విగ్రహ ప్రతిష్టపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు చెందిన నాయకులు, స్థానిక ప్రజలు అక్కడ భారీగా చేరుకోవడంతో పరిస్థితి మరింత్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకూ నచ్చజెబుతున్నారు.
బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదానికి కారణమైంది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోవడం లేదు. దీంతో బోధన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.