Telangana Congress: హైకమాండ్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన సీనియర్లు.. G-10 గ్రూప్ సమావేశంపై కొనసాగుతున్న డైలమా..
హైకమాండ్ హెచ్చరికలతో సీనియర్లు వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారు..G-10 గ్రూప్ సమావేశంపై డైలమా కొనసాగుతోంది. ఇప్పటి వరకు హోటల్ అశోకకు వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి మాత్రమే చేరుకున్నారు.
ఢిల్లీలో G-23…హైదరాబాద్‌లో G-10. ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ పీసీసీ(PCC)లో జరుగుతున్న పరిణామాలపై లోలోన రగిలిపోతున్న సీనియర్లంతా(Congress senior leaders) ఒక్కటయ్యారు. ఒక్కతాటిపైకి వచ్చారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు హోటల్ అశోకకు వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి మాత్రమే చేరుకున్నారు. మిగతా నేతలు హాజరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే ఈ మీటింగ్‌కు వెళ్లొద్దంటూ సీనియర్లకు హైకమండ్ నుంచి ఫోన్లు వెళ్లాయి. జీ 10 సభ్యుల అజెండా ఒక్కటే.. PCC చీఫ్ వన్‌మ్యాన్ షో.. ఒంటెద్దుపోకడపైనే చర్చ.! అసలే విషయమూ చెప్పకుండా.. ఏ మాత్రమూ పట్టించుకోకుండా.. రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సీనియర్లు. వుయ్ వాంట్ ఒరిజినల్ కాంగ్రెస్ అనే డిమాండ్‌ను బలంగా తెరపైకి తెస్తున్నారు. అంతే కాదు సెంట్రల్ కాంగ్రెస్‌తో తేల్చుకుంటామని వార్నింగ్‌లు ఇస్తున్నారు.
అయితే వీరి ప్రైవేట్ మీటింగ్‌పై హైకమాండ్ కన్నెర్ర జేసింది. AICC కార్యదర్శి బోస్ రాజు సీనియర్లందరికీ ఫోన్ చేశారు. ఏమైనా సమస్యలుంటే.. నేరుగా సోనియా, రాహుల్ గాంధీకి చెప్పుకోవాలే కానీ.. ఇలా విడి పడి సమావేశాలు పెట్టుకోవడం వల్ల పార్టీ నీ ఇబ్బందుల్లోకి నెట్టొద్దంటూ క్లియర్‌గా చెప్పేశారు.
సమావేశం రద్దు చేసుకోవాలని ఆదేశించారు. అటు వీహెచ్‌కి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్ చేశారు. ఈ ఆదేశాలన్నింటినీ బేఖాతరు చేస్తూ మీటింగ్‌కు హాజరయ్యారు సీనియర్లు.
సీనియర్ల మీటింగ్‌ను పక్కన పెడితే.. రేవంత్‌రెడ్డిపై మరోసారి నేరుగా విమర్శలు గుప్పించారు జగ్గారెడ్డి. ఒకప్పుడు PCC కమిటీలకు చాలా విలువ ఉండేదని ఇప్పుడవన్నీ నామమాత్రంగా మారయని ఆరోపించారు. రేవంత్, మాణిక్యం ఠాగూర్ కలిసి తనపై కుట్ర పన్నరాని ఆరోపించారు జగ్గారెడ్డి. TRSకు టచ్‌లో ఉన్నారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి: Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..
BP Control Tips: బీపీ అస్సలు రాకుండా ఉండాలంటే.. ముందు ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..