Telangana Congress: వన్‌ మ్యాన్‌ షోను కట్టడి చేయాలంటున్న సీనియర్ నేతలు.. మర్రి శశిధర్‌ రెడ్డి నివాసంలో మరోసారి భేటీ..

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ ప్రక్షాళన కోరుకుంటున్నారు. వన్‌ మ్యాన్‌ షో కట్టడి చేయాలంటూ రహస్య భేటీలతో సీన్ రక్తికట్టిస్తున్నారు. ఇవాళ కొంతమంది నేతలు మళ్లీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

Telangana Congress: వన్‌ మ్యాన్‌ షోను కట్టడి చేయాలంటున్న సీనియర్ నేతలు.. మర్రి శశిధర్‌ రెడ్డి నివాసంలో మరోసారి భేటీ..
Marri Shashidhar Reddy Resi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 20, 2022 | 8:34 AM

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు(Senior Congress leaders) పార్టీ ప్రక్షాళన కోరుకుంటున్నారు. వన్‌ మ్యాన్‌ షో కట్టడి చేయాలంటూ రహస్య భేటీలతో సీన్ రక్తికట్టిస్తున్నారు. ఇవాళ కొంతమంది నేతలు మళ్లీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్‌ మళ్లీ వరి వార్‌కి రెడీ అవుతుంటే.. ముందస్తు ఊహాగానాలతో కమలం పాదయాత్రలకు ప్లాన్‌ చేస్తోంది. కానీ కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం అసమ్మతి రాగం, వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పీసీసీ చీఫ్‌ దూకుడికి బ్రేకులేయాలంటూ ఏకంగా హైకమాండ్‌కి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు అసమ్మతి నేతలు. అంతకుముందే వరుస భేటీలు.. గాంధీ భవన్‌ను హీటెక్కిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పునర్వైభవం దిశగా అడుగులు పడుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం అసమ్మతి తుఫాన్‌ దుమారం రేపుతోంది. ఓవైపు ఎల్లారెడ్డిలో పీసీసీ చీఫ్‌ మీటింగ్‌.. మరోవైపు G-10 నేతలు భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా పీసీసీ చీఫ్‌పై గుర్రుగా ఉన్న నేతలు సీక్రెట్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మర్రి శశిధర్‌ రెడ్డి ఇంట్లో కొంతమంది నేతలు భేటీ అయ్యారు. ఇవాళ మళ్లీ సమావేశం కాబోతున్నారు.

మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరుతో భేటీ జరిగింది. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్‌, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డితో పాటు సీనియర్‌ నేతలు కోదండరెడ్డి, నిరంజన్, కమలాకర్‌రావు, శ్యాంమోహన్‌లు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా సాగిన భేటీలో రాజకీయ పరిణామాలు, పీసీసీ చీఫ్‌ వన్‌ మ్యాన్‌ షో, పార్టీ భవిష్యత్తు గురించి చర్చించారు.

పీసీసీ చీఫ్‌ పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందన్నది అసమ్మతి నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో కొంతమంది నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. వన్‌ మ్యాన్ షో కట్టడి చేస్తేనే పార్టీకి మేలు జరుగుతుందన్నది వాళ్ల వాదనగా కనిపిస్తోంది.

పీసీసీ చీఫ్‌ ఎన్నిక దగ్గర్నుంచి కొంతమంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి ఆగ్రహం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీనియర్ నేత వీహెచ్ అయితే పీసీసీ చీఫ్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ వీడుతారన్న ప్రచారంతో మొన్న జగ్గారెడ్డి.. నిన్న రాజగోపాల్‌తో భేటీ అయ్యారు వీహెచ్. పార్టీ వీడొద్దని విఙ్ఞప్తి చేశారు. నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తే కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన.

ఇంతకీ G-10 నేతల భేటీ ఏజెండా ఏంటి? వాళ్లను లీడ్ చేస్తుందెవరన్న చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా వీహెచ్‌ గట్టిగా వాయిస్ రెయిజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా మర్రి శశిధర్‌ రెడ్డి తోడయ్యారు. ఆయనకు హైకమాండ్‌ పెద్దలతో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. దీంతో ఈ భేటీలో ఏం జరగబోతుంది..? పీసీసీ చీఫ్‌పై కంప్లయింట్‌లు, పార్టీ పటిష్టత కోసం అధిష్టానానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: Kidney Cure: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Vastu tips: దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే.. పడకగదిలో ఈ ఫోటోలను పెట్టుకోండి..