Nalgonda Temperature: నల్గొండలో నిప్పుల కుంపటి.. దేశంలోనే టాప్ ప్లేస్.. పూర్తి వివరాలివే
మే నెలలో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి మార్చిలోనే (March) నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణ...
మే నెలలో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి మార్చిలోనే (March) నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు (Temperatures) మండిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల జాబితాలో నల్గొండ మొదటిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటున్న నిపుణుల హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మార్చిలోనే 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు భారీగా పెరిగింది. వేసవి కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఈ ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
నల్గొండలోనే కాకుండా తెలంగాణలోని అదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ, ఏపీలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మార్చి 21 నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 23 నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సారి ఎండలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వడగాలులతో నీరసం, అలసట, తీవ్రమైన దాహం, వడదెబ్బ వంటి వాటికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించటం అత్యవసరం.
Also Read
Russia Ukraine War: దాడులతో దద్దరిల్లిపోతున్న 18 నగరాలు.. ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దండయాత్ర..
Egg Benefits: నాటుకోడి గుడ్లు మంచివా లేక ఫారం కోడి గుడ్లు మంచివా..