Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Specialised Fibre: శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. మీ హార్ట్‌ రేట్‌ తెలుసుకోవాలా.. అయితే ఈ డ్రస్‌ వేసుకోండి

Specialised Fibre: బట్టలు శరీరాన్ని ఎండ, వాన , చలి నుంచి రక్షించడానికి ధరిస్తాము. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ధరించే దుస్తుల్లో కూడా అనేక రకాల రూపాలను సంతరించుకున్నాయి. కాలానికి అనుగుణంగా బట్టలు..

Specialised Fibre: శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. మీ హార్ట్‌ రేట్‌ తెలుసుకోవాలా.. అయితే ఈ  డ్రస్‌ వేసుకోండి
Specialised Fibre
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2022 | 3:02 PM

Specialised Fibre: బట్టలు శరీరాన్ని ఎండ, వాన , చలి నుంచి రక్షించడానికి ధరిస్తాము. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ధరించే దుస్తుల్లో కూడా అనేక రకాల రూపాలను సంతరించుకున్నాయి. కాలానికి అనుగుణంగా బట్టలు ధరిస్తాము. అయితే ఇప్పుడు కొందరికి ధరించే దుస్తులు స్టేటస్ సింబల్ గా కూడామారాయి. అయితే ఇప్పుడు అదే దుస్తులతో మన హార్ట్ బీట్(Heart Beat) కూడా కనిపెట్టవచ్చు అని అంటున్నారు పరిశోధకులు.

ఇప్పటి వరకూ మనం హార్ట్‌ రేటు తెలుసుకోడానికి ఫిట్‌బిట్‌నో, ఆపిల్‌ వాచ్‌నో వాడుతున్నాం. ఇప్పడు ఈ లిస్ట్‌లోకి మరో వస్తువు వచ్చి చేరింది. మ‌సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ దీనిని కనిపెట్టింది. ఇది ఒక వస్త్రం. ఈ వ‌స్త్రం ధ‌రిస్తే చాలు మీ హార్ట్ రేట్ తెలిసిపోతుంది.. ఇది మైక్రోఫోన్‌, ఇంకా స్పీకర్‌లాగా పనిచేస్తుందట. ఇందులో హార్ట్‌బీట్‌ను కొలిచే ప‌రిక‌రాలుంటాయట. . ఇది మ‌న చెవుల‌లాగా ప‌నిచేస్తుందట. ధ్వనిని మెకానికల్ వైబ్రేషన్‌లుగా మారుస్తుందట. అలాగే, మైక్రోఫోన్ ఫంక్ష‌న్స్ మాదిరిగానే వైబ్రేష‌న్ల‌ను ఎల‌క్ట్రిక్ సిగ్న‌ల్‌గా మారుస్తుందట. మాన‌వ చెవి క‌ర్ణ‌భేరినుంచి స్ఫూర్తిపొంది ప‌రిశోధ‌కులు ఈ వ‌స్త్రాన్ని త‌యారుచేశారట. మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప‌రిశోధ‌కులు.. రోడే ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ స‌హ‌కారంతో దీనిని రూపొందించారట. ఈ అధ్య‌య‌నం నేచుర‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైంది.

Also Read:

CISF Recruitment: సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..

మహారాష్ట్రలో ముదురుతున్న రాజకీయ వివాదం.. కేంద్రమంత్రికి నోటీసులు ఇచ్చిన బాంబే మున్సిపల్ కార్పొరేషన్