AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: ఇంటర్‌నెట్‌ వినియోగదారుల కోసం జియో రెండు సరికొత్త ప్లాన్స్‌.. పూర్తి వివరాలు..

Reliance Jio: టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది రియలన్స్‌ జియో. డేటా చార్జీలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదట్లోనే కోట్లాది మంది కస్టమర్లను తనవైపు తిప్పుకున్న రిలయన్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌..

Reliance Jio: ఇంటర్‌నెట్‌ వినియోగదారుల కోసం జియో రెండు సరికొత్త ప్లాన్స్‌.. పూర్తి వివరాలు..
Reliance Jio
Narender Vaitla
|

Updated on: Mar 21, 2022 | 9:49 AM

Share

Reliance Jio: టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది రియలన్స్‌ జియో. డేటా చార్జీలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదట్లోనే కోట్లాది మంది కస్టమర్లను తనవైపు తిప్పుకున్న రిలయన్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌ తీసుకొస్తూ వినియోగదారులను దూరం కాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ప్లాన్స్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా కేవలం ఇంటర్‌నెట్‌ డేటాను వినియోగించుకునే వారిని టార్గెట్‌ చేస్తూ ఈ రెండు ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే రూ. 2878, రూ. 2998 ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. మరి ఈ రెండు ప్లాన్స్‌ వల్ల వినియోగదారుడు పొందే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రూ. 2,878 ప్లాన్‌..

డేటా కాల పరిమితి ఎక్కువ రోజులు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ పూర్తి అయిన తర్వాత 64 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రీచార్జ్‌ ద్వారా ఎలాంటి ఎస్‌ఎంఎస్‌, కాల్స్‌ ప్రయోజనాలు లభించవు. ఈ లెక్కన యూజర్‌కు మొత్తం 730 జీబీ డేటా లభిస్తుంది.

రూ. 2998 ప్లాన్‌ లాభాలు..

ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా అందిస్తారు. 2.5 జీబీ హైస్పీడ్‌ ఇంటర్‌నెట్ తర్వాత 64 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ లభిస్తుంది. ఈ రీచార్జ్‌తో కూడా కేవలం ఇంటర్‌నెట్‌ మాత్రమే లభిస్తుంది. ఎలాంటి కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ బెనిఫిట్స్‌ లభించవు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్‌ ఈ ఆఫర్లను ప్రకటించింది.

Also Read: Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య

Viral Video: రెండు ఎద్దుల మధ్య భీకర పోరు.. మధ్యలో పెద్దరాయుడిలా దూసుకొచ్చిన కుక్క.. కట్ చేస్తే సీన్ అదుర్స్..!

Back pain: వెన్నునొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే వీటిని తినడం మర్చిపోకండి..

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?