Market News: ఊగిసలాటలో సూచీలు.. స్వల్ప లాభాలతో ఆరంభం.. ఫోకస్ లో ఉన్న ఆ షేర్లు..
Market News: అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు(Indian Market) స్వల్పలాభాల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇండీసెస్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి.
Market News: అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు(Indian Market) స్వల్పలాభాల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇండీసెస్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్(Sensex) సూచీ 40 పాయింట్ల ప్రారంభ లాభంతో ప్రారంభమైంది. మరో సూచీ నిఫ్టీ కేవలం 10 పాయింట్ల లాభంతో మెుదలైంది. ట్రేడింగ్ ఆరంభంలో మార్కెట్ సూచీలు స్వల్పంగా నెగటివ్ లోకి వెళ్లాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 220 పాయింట్లకు పైగా పతనమైంది. మరో సూచీ నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 140 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. 10 గంటల సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 50 పాయింట్ల మేర కోల్పోయింది. ఈ రోజు మార్కెట్ లో మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, అదానీ విల్మర్ షేర్లు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఫోకస్ లో ఉన్నాయి.
ఎన్ఎస్ఈ లో హిందాల్కో ఇండస్ట్రీస్ 3.17%, యస్ బ్యాంక్ 2.70%, మారుతీ సుజుకీ 2.57%, ఇండస్ టవర్స్ 2.42%, వేదాంతా 2.29%, సన్ ఫార్మా 2.00%, సిప్లా 1.98%, ఓఎన్జీసీ 1.76%, విప్రో 1.49%, టాటా స్టీల్ 1.27% మేర లాభపడి షేర్లు ప్రారంభ ట్రేడింగ్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
హెయిల్ 3.34%, హిందుస్థాన్ పెట్రోలియం 2.68%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.75%, హిందుస్థాన్ యూనిలివర్ 1.67%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.65%, ఏషియన్ పెయింట్స్ 1.62%, అదానీ పోర్ట్స్ 1.53%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.33%, ఎస్బీఐ 1.23%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.13% మేర నష్టపోయి షేర్లు ప్రారంభ ట్రేడింగ్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Multibagger Return: 13 సంవత్సరాల్లో లక్షాధికారిని కోటీశ్వరులను చేసిన షేర్.. పూర్తి వివరాలు..
EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..