One Rupee Idly, Bonda: గత కొన్నేళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ, బొండాలు.. క్వాలిటీ టిఫిన్ కోసం కస్టమర్స్ క్యూ.. ఎక్కడంటే
One Rupee Idly, Bonda: రోజు రోజుకీ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ వినియోగదారుడు, తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కొంతమంది కాలానికి అనుగుణంగా..
One Rupee Idly, Bonda: రోజు రోజుకీ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ వినియోగదారుడు, తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కొంతమంది కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ధరలకి అనుగుణంగా తాము తినే ఆహారపు వస్తువుల ధరలను పెంచుతున్నారు. అయితే ఒక ప్లేస్ లో మాత్రం నాణ్యమైన ఇడ్లీ, బోండా(Idly, Bonda)లను కేవలం ఒక్క రూపాయికే పెడుతున్నారు. ఇది నిజమా.. రూపాయికి ఏం వస్తుంది… ఒక అగ్గిపెట్టె.. ఒక చాక్లెట్.. అంతకుమించి ఏమీ రావు.. అని అనుకుంటున్నారా.. అయితే క్వాలిటీ టిఫిన్ ను తినాలంటే ఆంధ్రప్రదేశ్(Andhrapradesh ) లోని తూర్పుగోదావరి జిల్లా( East Godavari District) కు వెళ్లాల్సిందే. అక్కడ వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు ఒక్క రూపాయికే అందిస్తున్న ఈయన పేరు చిన్ని రామకృష్ణ.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ హోటల్ వాళ్లు రూ. 1కే 1 ఇడ్లీ, బోండాని ఇస్తున్నారు, ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన రేటు, నాణ్యత నే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు.. 16 ఏళ్ల నుంచి బయట అన్నీ రేట్లు పెరిగినా కూడా ఈ హోటల్‌లో మాత్రం టిఫిన్ రేట్ పెంచకుండా క్వాలిటీ టిఫిన్ ను అందిస్తున్నాడు. అందరూ రాంబాబుగా పిలుచుకునే ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. ఇక్కడ టిఫిన్ తినడానికి ఒక్క స్థానికులే కాదు.. చుట్టు పక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు తెల్లారగానే రాంబాబు హోటల్ ముందు క్యూ కడతారు. కడుపునిండా తిని వెళ్తారు.
ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ..బొండా తినే కొద్దీ తినాలనిపిస్తుంది.. రుచిగా శుచిగా ఉంటాయని కస్టమర్లు చెబుతుంటారు. ఐతే ఈ చట్నీని మాత్రం రాంబాబు సతీమణీ రాణి చేస్తారు. తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేచి ..ఉ.5 గంటల కల్లా వేడి వేడిగా టిఫిన్ సిద్దం చేస్తారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు, చుట్టు పక్కల ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది తాము తిని తమ తోటి వారికోసం టిఫిన్ తీసుకుని వెళ్లారు.
పదవ తరగతి ఫెయిల్ అయిన రాంబాబు మొదట్లో తన తండ్రితో పాటుగా మసాలా సామాన్లు అమ్మేవారు. ఐతే ఆ వ్యాపరం అంతగా కలిసి రాకపోవడంతో తన ఇంటి వద్దే 16 ఏళ్ళ క్రిందట చిన్న కాకా హోటల్ పెట్టుకున్నాడు.
ఇంత చౌక అంటే మరి నాణ్యత ఎలా ఉంటుందంటే: ఇక్కడ వచ్చే కస్టమర్‌లు రివ్యూ ప్రకారం చాలా ఖరీదైన టిఫిన్‌లు కంటే ఇక్కడే టిఫిన్ రుచి, నాణ్యత బాగుంటద. ఈ హోటల్‌లో 2 రకాల చట్నీలతో టిఫిన్ ఇస్తారు. మొదట్లో అర్ధ రూపాయికే ఇడ్లీ ఇచ్చిన రాంబాబు ఆ తర్వాత దానిని రూపాయికి పెంచాడు. అప్పటి నుండి రూపాయికే ఇడ్లీ, మైసూర్ బొండా ఇస్తూ..నేటీకి వాటి ధరలను పెంచలేదు. రాంబాబు అందించే టిఫిన్ నాణ్యత,రుచి విషయంలో ఎక్కడా రాజీ పడడు.అందుకే ప్రతిరోజు 400 లకు పైగా కస్టమర్లు రాంబాబు టిఫిన్ కోసం ఆర్బీ కొత్తూరు వస్తుంటారు. లాభం నీ మేనేజ్ చేస్తున్నాడు కానీ రేటు నీమాత్రం పెంచలేదు.
కార్మికులు లేరు,అద్దె లేదు: అందరిలా బయట ఎక్కడో అద్దె షాప్ కాకుండా రాంబాబు సొంత ఇంటిలో ఒంటరిగా ఈ హోటల్ నడుపుతున్నాడు. అందుకనే అద్దె కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు హోటల్ లో భార్య, అత్తగారు సహాయం చేస్తారు. దీంతో కార్మికులకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో రోజులో టిఫిన్ అమ్మిన డబ్బుతో మళ్ళీ మరుసటి రోజు కి సామన్లు తీసుకుంటాడు. మిగిలిన డబ్బుతో ఇల్లు నడిపిస్తున్నారు.
తోటి వ్యాపారుల ఒత్తడి: ఆ మధ్య ఇడ్లీ రేటు పెంచమని కొందరు తోటి వ్యాపారులు రాంబాబుపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారి మాటను పట్టించుకోకుండా ఒక్కరూపాయికే అమ్మడం కొనసాగిస్తున్నారు. ప్లేట్ టిఫిన్ తినాలంటే రూ.పది నుండి రూ. 30లు ఖర్చు పెట్టాల్సిన ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ ఇస్తూ రూపాయి విలువ పెంచి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రూపాయికే ఇడ్లీ ఇవ్వడం ఎలా గిట్టుబాటు అవుతుంది అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఒక్కటే. నాణ్యత.. రుచిలో రాజీ పడను. కస్టమర్లు పెరిగితే లాభాల మార్జిన్ దానంతట అదే వస్తుందని చిరునవ్వుతో సమాధానం చెబుతాడు. స్వంత లాభం సొంతమానుకుని.. పరులకు సాయ పడడంలో ఎంతో ఆనందం వుందంటున్నారు రాంబాబు. అన్నదాత సుఖీభవ. కేవలం ₹1కే ప్రజలకు ఆహారం అందించాలనే సంకల్పానికి రాంబాబు గారికి వందనాలు.
Mehreen Pirzada: సినీ జీవితం అంటేనే అంత.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన అందాల తార మెహరీన్..