Boy Cute Video: బుడ్డోడు చాలా షార్ప్.. వాళ్ల అమ్మని ఇట్టే పట్టేశాడు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు చూస్తుంటాం. కానీ ఇది చాలా భిన్నమైందిగా చెప్పొచ్చు. ఈ వీడియో ఒక తల్లి-కొడుకులకి సంబంధించినది. ఇది ఆ పిల్లవాడికి ఒక ఫజిల్ లాంటిది అని చెప్పొచ్చు. ఇందులో ఒక చిన్న పిల్లవాడు అనేకమంది మధ్య ఉన్న తన తల్లిని తడుముకోకుండా ఇట్టే గుర్తుపట్టేస్తాడు.
సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు చూస్తుంటాం. కానీ ఇది చాలా భిన్నమైందిగా చెప్పొచ్చు. ఈ వీడియో ఒక తల్లి-కొడుకులకి సంబంధించినది. ఇది ఆ పిల్లవాడికి ఒక ఫజిల్ లాంటిది అని చెప్పొచ్చు. ఇందులో ఒక చిన్న పిల్లవాడు అనేకమంది మధ్య ఉన్న తన తల్లిని తడుముకోకుండా ఇట్టే గుర్తుపట్టేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జనాల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. క్యూటెస్ట్ వీడియో అంటూ యూజర్లు ప్రశంసిస్తున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో పసుపు చీర కట్టుకున్న కొంతమంది మహిళలు ముసుగు కప్పుకొని ఒక గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక మహిళ చిన్న పిల్లవాడితో గదిలోకి వచ్చింది. వాస్తవానికి ఈ చిన్నపిల్లవాడు తన తల్లిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. కానీ అక్కడ చాలా మంది మహిళలు ఒకేలా ఉండటం చూసేసరికి షాక్ అయ్యాడు. మొదట తన తల్లి ఎవరో కనిపెట్టలేక కన్‌ఫ్యూజ్ అవుతాడు. కానీ తర్వాత జరిగింది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లవాడు తన తల్లిని ముసుగులో ఉన్నా కూడా ఇట్టే గుర్తుపట్టి ఒడిలో కూర్చుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తల్లీ కొడుకుల ఈ అందమైన వీడియో Instagramలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్ ఇప్పటివరకు తల్లీ కొడుకుల అందమైన వీడియో ఇదే అన్నాడు. మరొకరు తల్లి, కొడుకుల మధ్య అనుబంధం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పారు. ఓవరాల్‌గా ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

