- Telugu News Lifestyle Travel Ruby necklace road which built on siddipet komati cheruvu attracting tourists
Siddipet: సిద్ధిపేట సిగలో సరికొత్త మణిహారం.. కనువిందు చేస్తోన్న రూబీ నెక్లెస్ రోడ్ అందాలు..
Siddipet: తెలంగాణ ఉద్యం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధిపేట. ఇప్పుడు అభివృద్ధి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సిద్ధిపేట పట్టణానికే మణి హారంగా నిలిచిన కోమటి చెరువుపై తాజాగా నిర్మించిన రూబీ నెక్లెస్ రోడ్డు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది..
Updated on: Mar 21, 2022 | 12:38 PM

అభివృద్ధి విషయంలో తెలంగాణలో అగ్రగామిగా దూసుకుపోతున్న సిద్ధిపేట పట్టణం పర్యాటకంగానూ అందరినీ ఆకర్షిస్తోంది. నగరంలోని కోమటి చెరువుపై ఏర్పాటు చేసిన రూబీ నెక్లెస్ రోడ్ ఇప్పుడు రాష్ట్రం దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.

మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన రూబీ నెక్లెస్ రోడ్డుపై సైక్లింగ్ ట్రాక్, సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును మొత్తం మూడు విడతల్లో రూపొందించారు.

రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల వెలుగుల్లో రూబీ నెక్లెస్ రోడ్ జిగేల్ మంటోంది. ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ. 15.9 కోట్లు ఖర్చు చేశారు.

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TUFIDC) నిధులతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని వీక్షించడానికి హైదారాబాద్ ప్రాంత ప్రజలు కూడా వస్తుండడం విశేషం.

ఆసియాలోనే ఇలాంటి మోడల్‌లో నిర్మించిన తొలి నిర్మాణంగా పేరు తెచ్చుకున్న ఈ నెక్లెస్ రోడ్డుకు వేసవిలో పర్యాటకుల తాకిడి భారీగా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
