BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..

కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది.. తక్కువ ధరతో బోలెడన్ని ప్రయోజానాలు అందించేందుకు సిద్ధమైంది.

BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..
Bsnl
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 21, 2022 | 4:02 PM

కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది.. తక్కువ ధరతో బోలెడన్ని ప్రయోజానాలు అందించేందుకు సిద్ధమైంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కేవలం రూ. 797తో దాదాపు 365 రోజులు ఉపయోగించుకోవచ్చు.. దీని ద్వారా.. 2GB హైస్పీడ్ డేటాతోపాటు.. అపరిమిత వాయిస్ కాల్స్.. రోజువారీగా 100 SMS సదుపాయాలను అందిస్తుంది. అంతేకాకుండా.. బీఎస్ఎన్ఎల్ పరిమిత కాలానికి పరిచయ ఆఫర్‏గా 30 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తోంది. అంటే ఆఫర్ సమయంలోపు.. బీఎస్ఎన్ఎల్ 797 ప్రీపెయిడ్ ప్లాన్‏ను సబ్‏స్ర్కయిబ్ చేసుకున్న వినియోగదారులు మొత్తం 395 రోజుల వరకు చెల్లుబాటు పొందుతారు. సందేహాలు ఉన్నవారు బీఎస్ఎన్ఎల్ ఇతర వివరాలను చెక్ చేసుకువచ్చు..

BSNL 797 Prepaid Plan: ప్రయోజనాలు..వ్యాలిడిటీ :-

కొత్త బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.797 అపరిమిత లోకల్.. ఎస్టీడీ.. రోమింగ్ కాల్స్‏తోపాటు.. 2జీబీ హైస్పీడ్ డేటా.. 60 రోజులపాటు రోజుకు 100 సందేశాలు పంపుకోవచ్చు. అయితే ఆఫర్ గడువు 60 రోజులతో ముగుస్తుంది. అంతేకాకుండా.. కొనుగోలుదారులు వోచర్ ప్యాక్‏తో కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి టాక్ టైమ్ లేదా డేటా ప్లాన్స్ ను ఎంచుకోవాలి. ఈ డేటా ప్లాన్ అనేది.. ఫెయిర్ యూసేజ్ పాలసి (FUP) ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇచ్చిన కేటాయింపును వినియోగించిన తర్వాత 80kbpsకి తగ్గించబడుతుంది. అదనపు 30 రోజుల వాలిడిటీ జూన్ 12వరకు చెల్లుబాటు అవుతుందని బీఎస్ఎన్ఎల్ కర్ణాటక విభావం ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అది పనిచేసే అన్ని సర్కిల్స్‏లో అందుబాటులో ఉంటుంది.

BSNL ఆన్ లైన్ పోర్టల్‏కు లాగిన్ అయ్యి.. కస్టమర్లు కొత్త ప్లాన్‏కు సభ్యత్వాన్ని పొందవచ్చు. సబ్‏స్ర్కైబ్ చేసుకున్నవారు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే నాలుగు శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా రీఛార్జ్ ప్లాన్ గూగుల్ పే.. పేటీఎం వంటి థర్ట్ పార్టీ ప్లాట్ ఫామ్స్ లలో కూడా లభిస్తుంది. ఈ రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ 395 రోజుల వరకు నెట్ వర్క్‏లో యాక్టివ్‏గా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే బీఎస్ఎన్ఎల్‏ను సెకండరీ సెల్యులార్ నెట్‏వర్క్‏గా కలిగి ఉన్న వ్యక్తులకు ఇది ఉపయోగపడుతుంది.

lso Read: RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..

OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..