Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..

ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)... ఎలాంటి ఆర్బాటం లేకుండా విడుదలైన ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించిది. విడుదలైన మొదటి రోజునే

Aamir Khan: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..
Aamir Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 21, 2022 | 4:38 PM

ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)… ఎలాంటి ఆర్బాటం లేకుండా విడుదలైన ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించిది. విడుదలైన మొదటి రోజునే సెన్సెషన్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమా కశ్మీర్ పండితుల జీవితంపై.. వారు ఎదుర్కొన్న పరిస్థితులపై తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించాడు.. రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా మార్చి 25న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గోన్నాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.

మీరు ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారా ? అని విలేకరులు అడగ్గా.. పని బిజీలో ఉండడం వలన నేనింకా ఆ మూవీ చూడలేదు. కానీ తప్పకుండా చూస్తాను. ది కశ్మీర్ ఫైల్స్ మన చరిత్రకు నిదర్శనం ఒకానొక సమయంలో కశ్మీర్ పండితులపై జరిగిన తిరుగుబాటు.. విచారకరం. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా భావోద్వేగానికి గురి చేసింది. ఈ మూవీ విజయం సాధించినందుకు ఎంతో ఆనందిస్తున్నా అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. 1990లో కశ్మీర్ లో చేలరేగిన తీవ్రమైన ఉగ్రవాదంలో పండితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణాలు చూడలేక మరికొందరు సొంతూరును వదిలిపెట్టి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆ కన్నీటి వెతల రూపమే ది కశ్మీర్ ఫైల్స్.

Also Read: RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..

OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..