Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అరుదైన ఫోటోస్‏తో అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!
Childhood
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 21, 2022 | 9:13 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. (Actress Photo) అరుదైన ఫోటోస్‏తో అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు నెటిజన్స్. అలాగే సెలబ్రెటీలు కూడా తమ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ.. అభిమానులతో జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇక తమ అభిమాన స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్‏ను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఈ త్రోబ్యాక్ ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. క్యూట్ క్యూట్‏గా చిలిపి చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. గుర్తుపట్టండి..

ఆ క్యూట్ క్యూట్ చిన్నారి మరెవరో కాదండో.. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. స్టార్ హీరో అనిల్‌ కపూర్‌ వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్‌ కపూర్. సావరియా సినిమాలో రణబీర్‌ కపూర్‌తో కలిసి వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఢిల్లీ-6, ఐ హేట్‌ లవ్‌స్టోరీస్‌, మౌసమ్‌, ప్లేయర్స్‌, థ్యాంక్యూ, రాన్‌జానా, ఖూబ్‌సూరత్, ప్రేమ్‌రతన్‌ధన్‌పాయో, నీర్జా, ప్యాడ్‌మ్యాన్‌, వీర్ ది వెడ్డింగ్‌ వంటి చిత్రాల్లో నటించి మెప్పింది. ముఖ్యంగా నీర్జా సినిమాలో ఆమె అభినయానికి విమర్శకులు ప్రశంసలు కురిపించారు. చివరిగా 2019లో విడుదలైన జోయా ఫ్యాక్టర్‌ సినిమాలో ఫుల్‌లెంత్ హీరోయిన్‌గా నటించింది సోనమ్. ఆతర్వాత ఏకే వర్సెస్‌ ఏకె సినిమాలో కీలక పాత్రలో నటించింది. సోనమ్‌- లది ప్రేమ వివాహం. 2018 ముంబైలోని బాంద్రాలో తన ప్రియుడు వీరి వివాహం ఆనంద్‌‏ను ప్రేమ వివాహం చేసుకుంది.

Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..

BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..