Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్ బయోపిక్.. టీజర్ దుమ్మురేపుతోంది..!
Shabaash Mithu: క్రికెట్‌కు, బాలీవుడ్‌కు మధ్య ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను పెళ్లి చేసుకున్నారు.
Shabaash Mithu: క్రికెట్‌కు, బాలీవుడ్‌కు మధ్య ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో చాలా మంది క్రికెట్ ఆటగాళ్లపై బయోపిక్‌లు వచ్చాయి. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. స్పోర్ట్స్ బయోపిక్ ‘శభాష్ మిథు’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది. భారత్‌లో క్రికెట్ గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ టీజర్ జెంటిల్‌మన్ గేమ్‌లో మిథాలీ సాధించిన విజయాలను ప్రదర్శిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరించబడిన ఈ చిత్రం మిథాలీ జీవితం, ఎత్తుపల్లాలు, వైఫల్యాలు, ఉత్కంఠ క్షణాలను చిత్రీకరిస్తుంది. వయాకామ్ 18 స్టూడియోస్‌పై శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన శభాష్ మిథు చిత్రంలో విజయ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
భారత మహిళల జట్టు టెస్ట్, ODI క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె పేరుపై అనేక రికార్డులు ఉన్నాయి. ఆమెను ‘సచిన్ టెండూల్కర్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్’ అని పిలుస్తారు. మిథాలీ రాజ్ తన తండ్రి ఒత్తిడితో క్రికెటర్‌గా మారారు. వాస్తవానికి ఆమెకి నృత్యం చేయడమంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి డాన్సర్ కావాలనే బలమైన కోరిక ఉండేది. భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. మిథాలీ సోదరుడు, తండ్రి కూడా మాజీ క్రికెటర్లు. మిథాలీ రాజ్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చూడడం అంటే ఇష్టం.
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్
మిథాలీ రాజ్ 1999లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఆమె బ్యాట్ పరుగులు పెడుతూనే ఉంది. వన్డే క్రికెట్‌లో 7000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి మహిళా క్రీడాకారిణి. వన్డే క్రికెట్‌లో ఆమె పేరిట 7 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో టీ20 క్రికెట్‌లో 2364 పరుగులు చేసింది. ఆమె చాలా క్లాసిక్ బ్యాట్స్‌మెన్. ఆమె క్రీజులో ఉంటే భారత జట్టు విజయం ఖాయం.
In this Gentlemen’s sport, she did not bother to rewrite history ….. instead she created HER STORY! #AbKhelBadlega #ShabaashMithu Coming soon! #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou pic.twitter.com/qeztCiCu45
— taapsee pannu (@taapsee) March 21, 2022