Viral Video: డ్యాన్స్‌ అంటే ఇలా ఉండాలి.. పరేషాన్ అవుతున్న నెటిజన్లు..!

uppula Raju

uppula Raju |

Updated on: Mar 21, 2022 | 10:49 PM

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో వివాహ వేడుకలు, సంగీత్‌, బరాత్‌లలో జరిగే డ్యాన్స్‌లు చాలా ఫేమస్

Viral Video: డ్యాన్స్‌ అంటే ఇలా ఉండాలి.. పరేషాన్ అవుతున్న నెటిజన్లు..!
Bhabhi Dance

Follow us on

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో వివాహ వేడుకలు, సంగీత్‌, బరాత్‌లలో జరిగే డ్యాన్స్‌లు చాలా ఫేమస్ అవుతుంటాయి. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌గా మారుతాయి. నెటిజన్లు ఈ వీడియోలని పదే పదే చూసి ఎంజాయ్ చేస్తారు. లైక్స్, కామెంట్స్‌, షేర్స్‌ చేస్తూ ఆనందిస్తారు. తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక మహిళ చేసిన డ్యాన్స్‌కి అందరు పరేషాన్ అవుతున్నారు. ఆమె తన డ్యాన్స్‌తో చుట్టుపక్కల వారిని ఒక్కసారిగా ఆశ్చరపరుస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ మహిళని అభినందించకుండా ఉండలేరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అది ఒక వివాహ వేడుకలా కనిపిస్తుంది. అందరు సరదాగా పార్టీ మూడ్‌లో ఉన్నారు. అందులో కొంతమంది మహిళలు గుంపుగా చేరుకొని మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు.

ఇంతలో మ్యూజిక్ ప్లే కావడంతో అందరు డ్యాన్స్‌ చేయాలని భావిస్తారు. ఇంతలో అందులో ఉన్న ఒక మహిళ తన స్టెప్‌తో అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన డ్యాన్స్‌కి చుట్టుపక్కల వారందరు చప్పట్లతో ఎంకరేజ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఉన్నట్టుండి ఆమె చేసిన డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కామెంట్లతో ఆ మహిళని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హనీసింగ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో జనాలకు బాగా నచ్చుతోంది. మహిళ డ్యాన్స్ నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. వీడియో మిలియన్ల కొద్దీ వీక్షణలు, వేలకొద్దీ లైక్‌లను పొందింది. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by honey Singh (@honeysingh.2013)

Viral Picture: మీ కళ్లకి ఒక పరీక్ష..ఈ ఫొటోలో ఉన్న దానిని కనిపెడితే మీరు జీనియస్..!

South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..104 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..

Health News: చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుందా.. ఇవి భయంకరమైన ఆ వ్యాధి లక్షణాలు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu