Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!
Relationship: ఆధునిక కాలంలో ఆడ, మగ అనే తేడా లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు.ముఖ్యంగా పాత రోజుల నుంచి పోల్చుకుంటే మహిళలు చాలా అభివృద్ధి సాధించారు. అన్నిరంగాల్లో మగవారితో ధీటుగా పోటి పడుతున్నారు.
Relationship: ఆధునిక కాలంలో ఆడ, మగ అనే తేడా లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత రోజుల నుంచి పోల్చుకుంటే మహిళలు చాలా అభివృద్ధి సాధించారు. అన్ని రంగాల్లో మగవారితో ధీటుగా పోటి పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. రక్షణ రంగంలోకి కూడా కాలు మోపి కదం తొక్కుతున్నారు. అయితే ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పురుషులు, మహిళల్లో కొన్ని తేడాలుంటాయి. వర్క్ ప్లేసుల్లో వీరిమధ్య సహకారం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సహజంగా ఆఫీసుల్లో మహిళలు మగవారితో చాలా తక్కువగా మాట్లాడుతారు. కొంతమంది కలివిడిగా కనిపించినా చాలామంది డిస్టెన్స్ మెయింటెన్ చేస్తారు. ఇలాంటి మహిళలు స్మోక్ చేయరు. ఆల్కహాల్ కూడా తీసుకోరు. సాధారణంగా ఆఫీసులో ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు పురుషులు ఎంజాయ్ చేయడానికి పబ్‌లకి వెళుతారు. కానీ ఎక్కువ మంది మహిళలు దీనిని అవైడ్ చేస్తారు. అలాగే పురుషులు కూడా మహిళలతో ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు చెప్పరు. దీనికి కారణం ఏంటంటే మహిళలు ఉన్నప్పుడు వారు ఆల్కహాల్ తీసుకోలేరు. అదే విధంగా ఇటువంటి విషయాల గురించి చర్చించరు.
ఒక అధ్యయనంలో తెలిసింది ఏంటంటే మహిళలు ఎమోషన్స్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే ఆఫీసుల్లో మహిళల చిరునవ్వు, జాలి గుణం వల్ల ప్రశంసలు దక్కుతాయని తేలింది. అదే పురుషులకైతే వారి పనిని బట్టి మాత్రమే ప్రశంసలు ఉంటాయి. సాధారణంగా పురుషులు తరచూ మహిళలని ఏడిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు వంట వండిన లేదంటే పిల్లల్ని చూసుకునే విధానంలో వెక్కిరిస్తూ ఉంటారు. కానీ మహిళలకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్వరు ఏమనుకున్నా ఉద్యోగంతో పాటు పిల్లలని చూసుకోవాలి. ఇంట్లో వంట చేయాలి. ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంటుంది. పైగా వారికి ఎవరు సహాయం కూడా చేయరు. అందుకే వారికి విశ్రాంతి దొరకడం కష్టం. పురుషులు మాత్రం జాబ్ మాత్రమే చేసి మిగతా టైం మొత్తం వేస్ట్ చేస్తారు. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. కానీ మహిళలు అది చేయలేరు.