Buchi Babu Sana : బుచ్చిబాబు సినిమాలో యంగ్ టైగర్ ఆ పాత్రలో కనిపించనున్నారట.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో గట్టిగ వినిపించిన పేరు బూచిబాబు. సుకుమార్ శిష్యుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేశారు

Buchi Babu Sana : బుచ్చిబాబు సినిమాలో యంగ్ టైగర్ ఆ పాత్రలో కనిపించనున్నారట.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2022 | 9:55 AM

Buchi Babu Sana : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో గట్టిగ వినిపించిన పేరు బూచిబాబు. సుకుమార్(Sukumar) శిష్యుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాతో మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న బూచి బాబుకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ అయన మాత్రం ఆచి తూచి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. చిన్న సినిమాతో భారీ హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ట్రైచేస్తున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ నఎన్టీఆర్ తో మూవీ చేయాలని చూస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా నాన్నకు ప్రేమతో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బుచ్చిబాబు అప్పటి నుంచి తారక్ తో ఎలాగైనా సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకున్నాడు కాబట్టి నెక్స్ట్ సినిమా తారక్ తోనే అని గట్టిగ ఫిక్స్ అయ్యేరు.

ఇదిలా ఉంటే ఇప్పటికే తారకు కథను వినిపించిన బుచ్చిబాబు ఆయన దగ్గరనుంచి గ్రీన్ సిగ్నల్ ను కూడా తెప్పించుకున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవ్వడంతో ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో కాస్త స్లిమ్ లుక్ లో కనిపించనున్నారు తారక్. కానీ ఇప్పుడు గుబురు గడ్డంతో కొద్దిగా చబ్బీ లుక్ లో కనిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కొరటాల శివ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉండనుంది ఈ సినిమా స్పోర్ట్స్  డ్రామాగా తెరకెక్కుతోందని.. ఈ సినిమాలో తారక్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారని టాక్. ఇందుకోసమే ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగి చబ్బీ లుక్ లోకి మారారని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్.. టీజర్‌ దుమ్మురేపుతోంది..!

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే