Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) వినియోగం ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అనివార్యంగా మారింది. తమ జీవితాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటుగా మారిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దీనికి...

Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 22, 2022 | 10:46 AM

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) వినియోగం ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అనివార్యంగా మారింది. తమ జీవితాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటుగా మారిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దీనికి ఎవరూ అతీతులు కారనిపిస్తోంది. ముఖ్యంగా సినీ తారలు సోషల్‌ మీడియా ద్వారానే అభిమానులకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. మొహం కనిపించుకుండా వెనకా నుంచి తీసిన ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ హీరోయిన్‌. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ చిన్నది కెరీర్‌లో పీక్‌లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది. ప్రస్తుతం పండటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌తో ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ.!

అవును మీరు అనుకుంటోంది నిజమే కెమెరాకు కనిపించకుండా ఫోటో దిగిన ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార, టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌. 2020 అక్టోబర్‌లో, ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్న ఈ చిన్నది. ప్రస్తుతం తల్లి కాబోతోంది. ఈ క్రమంలోనే తల్లి కాబోయే మధుర క్షణాలను ఎప్పటికీ నిలిచిపోయేలా కాజల్‌ ప్లాన్‌ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఫోటో షూట్‌లతో హల్చల్‌ చేస్తోంది.

Also Read: ఆదిలాబాద్‌లో బద్దలవుతున్న అక్రమాల పుట్ట.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు స్కాములు.. కోట్ల రూపాయలు హాంఫట్!

Zomato Food Delivery: జొమాటో కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ

Aishwarya Rajesh: ఎర్ర కలువ పువ్వుల వయ్యారాలు వలకబోస్తున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్..