Zomato Food Delivery: జొమాటో కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ
Zomato Food Delivery: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇన్‌స్టంట్ ఫుడ్ కోసం ఆన్‌లైన్ యాప్‌లను అనుసరిస్తున్నారు వినియోగదారులు...
Zomato Food Delivery: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇన్‌స్టంట్ ఫుడ్ కోసం ఆన్‌లైన్ యాప్‌లను అనుసరిస్తున్నారు వినియోగదారులు. ఫుడ్ డెలివరీలో స్విగ్గీ, జొమాటోలు దూసుకుపోతున్నాయి. ఇక వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లోపే ఫుడ్‌ను డెలివరీ చేసే జొమాటో ఇన్‌స్టంట్ సేవలను (Zomato Instant Service) త్వరలో ప్రారంభించబోతున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal) వెల్లడించారు. జొమాటో సగటు డెలివరీ సమయమైన 30 నిమిషాలు. అయితే ఇది చాలా ఎక్కువని మేము భావిస్తున్నాము. ఇదే కొనసాగితే సంస్థ వెనుకబడిపోతుంది. పోటీ ప్రపంచంలో వినియోగదారులకు త్వరగా ఫుడ్‌ను అందించడం ఎంతో అవసరం. ఈ రంగంలో మనుగడ సాధించాలంటే స్పీడ్‌గా డెలివరీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. అందుకే జొమాటో ఇన్‌స్టంట్‌ను ప్రారంభిస్తున్నాము అని తమ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవ్వరు కూడా 10 నిమిషాల్లో తాజా ఆహారాన్ని డెలివరీ చేలేదని, ఈ విభాగంలో ఈ ఘటన సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా రెస్టారెంట్ల నుంచి 20-30 వంటకాలను అందిస్తాయి. అయితే ఫుడ్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రెస్టారెంట్, డెలివరీ భాగస్వాముల ఆదాయం తగ్గదని కంపెనీ చెబుతోంది.
నాలుగు స్టేషన్‌లలో జొమాటో ఇన్‌స్టంట్ సేవలు:
కాగా, జొమాటో ఇన్‌స్టంట్ సేవలు ఏప్రిల్ నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో కొన్ని నియమాలను ఉంచినట్లు తెలిపారు. ఇంటి భోజనం లాగే, ధర తక్కువ, నాణ్యత ఎక్కువ, ప్రపంచ స్థాయి శుభ్రతా ప్రమాణాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ తగ్గించడం, వేగ వంతంగా డెలివరీ చేయడం వంటివి ఉన్నట్లు చెప్పారు.
Announcement: 10 minute food delivery is coming soon on Zomato.
Food quality – 10/10 Delivery partner safety – 10/10 Delivery time – 10 minutes
Here’s how Zomato Instant will achieve the impossible while ensuring delivery partner safety – https://t.co/oKs3UylPHh pic.twitter.com/JYCNFgMRQz
— Deepinder Goyal (@deepigoyal) March 21, 2022
ఇవి కూడా చదవండి: