RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో కో-ఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. కారణం ఏంటంటే..!

RBI: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు జరిమానా విధించడం, లైసెన్స్‌ రద్దు చేయడం లాంటివి చేస్తుంటుంది...

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో కో-ఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. కారణం ఏంటంటే..!
Follow us

|

Updated on: Mar 22, 2022 | 7:24 AM

RBI: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు జరిమానా విధించడం, లైసెన్స్‌ రద్దు చేయడం లాంటివి చేస్తుంటుంది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (Co operative Bank) లైసెన్స్‌ను ఆర్బీఐ సోమవారం రద్దు చేసింది. యూపీ కోఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా బ్యాంక్ మూసివేతకు ఉత్తర్వు జారీ చేయవలసిందిగా సూచించింది. బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా ఆదేశించింది.

సహకార బ్యాంకు డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లించడానికి వీలులేదని, దానిని కొనసాగించడానికి అనుమతిస్తే ప్రజల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించకుండా నిషేధించబడింది. ఇందులో డిపాజిట్ల అంగీకారం, తిరిగి చెల్లింపు ఉంటుంది. లిక్విడేషన్‌పై ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తంగా రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ అందించిన డేటా ప్రకారం.. 99 శాతానికి పైగా డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని పొందడానికి అర్హులు అని ఆర్‌బిఐ తెలిపింది.

లైసెన్స్ ఎందుకు రద్దు

పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ చెప్పిన కారణాల ప్రకారం.. బ్యాంకుకు తగినంత మూలధనం లేదా ఆదాయ వనరు లేదు. అటువంటి పరిస్థితిలో బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను అనుసరించదు. నియంత్రణ చట్టంలోని కొన్ని నిబంధనలను కూడా బ్యాంకు పాటించలేదు. బ్యాంకును ఇంకా కొనసాగిస్తే డిపాజిటర్లపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న ఖాతాదారులకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వలేని విధంగా ప్రస్తుతం బ్యాంకు పరిస్థితి ఉంది.

ఇవి కూడా చదవండి:

IDBI: ఐడీబీఐ ప్రైవేటీకరణ కోసం ముమ్మర కసరత్తు.. లోక్‌సభలో వెల్లడించిన భగవత్ కరాద్..

Gold Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..