Gold Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి...

Gold Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 22, 2022 | 6:13 AM

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాల కారణంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం (March 22) బంగారం, వెండి ధరలు పెరిగాయి. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,930 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,290 వద్ద నమోదవుతోంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద ఉంది.
  3. ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.51,700 ఉంది.
  4. కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 ఉంది.
  5. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 ఉంది.
  6. హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700 వద్ద ఉంది.
  7. విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700 ఉంది.
  8. కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700 వద్ద ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, ముంబైలో రూ.68,300 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, కోల్‌కతాలో రూ.68,300 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, కేరళలో రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం, వెండి ధరల్లో రోజులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Prices: వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ ధర ఎంతంటే..?

Mukesh Ambani: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట.. మొదటి రోజు ఇలా..