IDBI: ఐడీబీఐ ప్రైవేటీకరణ కోసం ముమ్మర కసరత్తు.. లోక్‌సభలో వెల్లడించిన భగవత్ కరాద్..

కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న కొన్ని సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలను ప్రైవేటీకరించింది...

IDBI: ఐడీబీఐ ప్రైవేటీకరణ కోసం ముమ్మర కసరత్తు.. లోక్‌సభలో వెల్లడించిన భగవత్ కరాద్..
Idbi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2022 | 6:34 AM

కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న కొన్ని సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలను ప్రైవేటీకరించింది. కరోనా(Corona) సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కాస్త నెమ్మదించినా.. ఇప్పుడు స్పీడ్ పెంచుతోంది. త్వరలో ఎల్‌ఐసీ(LIC)లో 5 శాతం వాటా ఐపీఓ ద్వారా విక్రయించనుంది. ఇటు ఐడీబీఐ(IDBI) బ్యాంకు ప్రైవేటీకరణ దిశగా పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. ఈ బ్యాంకు ప్రైవేటీకరణకు సంబంధించి పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం రోడ్‌షో నిర్వహిస్తోంది. మే 2021లో IDBI బ్యాంక్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో ఎల్‌ఐసీ, ప్రభుత్వం 94 శాతానికి పైగా వాటాలను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం, ఎల్‌ఐసీ ఎంత వాటాను విక్రయిస్తాయనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు.

ఈరోజు లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ ఈ బ్యాంకు ప్రైవేటీకరణపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐడిబిఐ బ్యాంక్‌ను ఎవరు కొనుగోలు చేసినా ఆ బ్యాంకులో మూలధన ఇన్ఫ్యూషన్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. నాన్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 5.29 శాతంగా ఉంది. పెట్టుబడిదారులకు సంబంధించి సరైన సమాచారం అందించేందుకు రోడ్‌షో నిర్వహిస్తున్నట్లు కరాద్‌ తెలిపారు.

ఇందులో ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను చేస్తుందని కరాద్ చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు, వాటాదారుల ప్రయోజనాలను పూర్తి రక్షణ ఉంటుందన్నారు.ఈ రోజు IDBI బ్యాంక్ షేర్లు పెరిగాయి. ఈ స్టాక్ ప్రస్తుతం 4.4 శాతం లాభంతో రూ.44.75 స్థాయిలో ఉంది.

Read Also.. IT Alert: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ విషయాలు పూర్తి చేశారా.. వెంటనే కంప్లీట్ చేయండి..