AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..

Mukesh Ambani: ముకేశ్ అంబానీ సారధ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) వేగంగా ముందుకు సాగుతోంది. కొత్త కంపెనీలను కొనుక్కుంటూ తగ్గేదే లే అంటూ శరవేగంగా వెళుతోంది.

Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..
Mukesh Ambani
Ayyappa Mamidi
|

Updated on: Mar 22, 2022 | 6:39 AM

Share

Mukesh Ambani: ముకేశ్ అంబానీ సారధ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) వేగంగా ముందుకు సాగుతోంది. కొత్త కంపెనీలను కొనుక్కుంటూ తగ్గేదే లే అంటూ శరవేగంగా వెళుతోంది. మెున్న క్లోవియా అనే లోదుస్తుల సంస్థలో 89 శాతం వాటాలను కొనుగోలు చేసింది అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్(Reliance Retail) సంస్థ. ఇందుకోసం మెజారిటీ వాటాలను రూ.950 కోట్లతో కొనుగోలు చేసింది. ఇదే సమయంలో.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అసెట్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్‌ ప్రణాళికను సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ రుణదాతలు ఏకగ్రీవ ఆమోదం లభించింది.

తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ కోసం దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్, ఏసీఆర్‌ఈలు ఉమ్మడి బిడ్‌ దాఖలు చేశాయి. బిడ్ విలువ రూ.3,000 కోట్లుగా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ రాయితీ తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గించడం జరుగుతుంది. అలాగే కంపెనీ స్టాక్‌ ఎక్ఛ్సేంజీలు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుండి డీలిస్ట్‌ అవనుంది. దాదాపు రూ.7.5 కోట్ల రుణ బకాయిలకోసం క్లెయిమ్స్ ఇప్పటికే దాఖలయ్యాయి.

2020–21 లో సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌(Sintex Industries) ఆదాయం రూ. 1,689.15 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో, కన్సాలిటేడెడ్‌ నిర్వహణా ఆదాయం 80 శాతం పెరిగి, రూ.942.66 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర నష్టం రూ.214.99 కోట్ల నుంచి రూ.103.25 కోట్లకు తగ్గింది. సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో సోమవారం 5 శాతం నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది. ఈ షేర్ డీలిస్టింగ్ కారణంగా వరుసగా లోయర్ సర్కూట్లను తాకుతూ పోతోంది. అతి త్వరలోనే దీని విలువ సున్నాకు చేరనుంది. గతంలో వీడియోకాన్, డీహెచ్ఎఫ్ఎల్ షేర్లను సైతం ఇలా డీలిస్ట్ చేశారు.

ఇవీ చదవండి..

Gold Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

LIC IPO: మే 12కు ముందే ఎల్‌ఐసీ ఐపీఓ..! సెబీకి DRHP సమర్పించిన అధికారులు..