ఆదిలాబాద్‌లో బద్దలవుతున్న అక్రమాల పుట్ట.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు స్కాములు.. కోట్ల రూపాయలు హాంఫట్!

ఆదిలాబాద్ జిల్లా స్కాములకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఒకటి కాదు రెండు మూడు పథకాలను సొమ్మును అపన్నంగా నొక్కేశారు. పథకాల్లో లోపాలను ఆసరగా చేసుకుని అక్రమార్కులు అందినకాడికి దండుకున్నారు.

ఆదిలాబాద్‌లో బద్దలవుతున్న అక్రమాల పుట్ట.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు స్కాములు.. కోట్ల రూపాయలు హాంఫట్!
Fraud
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 22, 2022 | 9:48 AM

Government Schemes Fraud: ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) స్కాములకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఒకటి కాదు రెండు మూడు పథకాలను సొమ్మును అపన్నంగా నొక్కేశారు. పథకాల్లో లోపాలను ఆసరగా చేసుకుని అక్రమార్కులు అందినకాడికి దండుకున్నారు. మొన్న గ్రామీణ బ్యాంక్ కిషాన్ కార్డ్(Kisan Card) స్కాం, నిన్న డీసీసీబీ బ్యాంక్‌(DCCB )లో కోట్లకు కోట్లు గోల్ మాల్.. తాజాగా ఉపాధి హామీ పనుల్లో రూ. కోటీ 85 లక్షల నిధులు మాయం.. ఇలా వరుస ఘటనలు ఇటు జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వరుస స్కాంలు వెలుగు చూస్తుండటంతో అదికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఎక్కడ స్కాంల భాగోతం తమ మెడకు చుట్టుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు ఉన్నతాదికారులు. నెల రోజుల వ్యవధిలో వరుసగా చోటు చేసుకున్న మూడు వేర్వేరు స్కాంల్లో ఇప్పటికే 14 మంది ఉద్యోగులు సస్పెండ్ కాగా.. 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సాంకేతిక లోపం ఆసరగా కోట్ల స్కాం పిబ్రవరి 18న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో కిషాన్ క్రెడిట్ కార్డుల గోల్ మాల్ భాగోతం వెలుగు చూసింది. ఈ ఘటనలో సాంకేతిక లోపాన్ని ఆసరగా చేసుకుని మామిడిగూడ కస్టమర్ సెంటర్ పాయింట్ నిర్వహకుడు జెటల రమేష్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం చిన్న సల్పల గ్రామానికి చెందిన మడావి‌ రాంబాయి, కొడప భీంరావు , కొడప గంగాదేవికి చెందిన కిషాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లలలో నుండి కోటీ 28 లక్షల రూపాయలకు పైగా డబ్బులు విత్‌డ్రా చేశాడు. అలా డ్రా చేసిన డబ్బుల్లో కేవలం రూ.16 లక్షలు మాత్రమే ఈ ముగ్గురు రైతులకు అప్పగించాడు. మిగిలిన రూ.కోటీ 12 లక్షల 78 వేలను మింగేసాడు. ఈ విషయాన్ని ఇటు బ్యాంకు అదికారులకు కానీ అటు రైతులకు కానీ చెప్పకుండా రహస్యంగా ఉంచి మోసం చేశాడు. ఆలస్యంగా గుర్తించిన హైదరబాద్ గ్రామీణ బ్యాంక్ ప్రదాన కార్యాలయ అదికారులు.. ఆదిలాబాద్ బ్యాంక్ అదికారులను అలర్ట్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. చేసేది లేక సొమ్ము రికవరీ కోసం విశ్వప్రయత్నాలు చేసి, చివరికి నెల రోజుల తరువాత పోలీసులను ఆశ్రయించారు గ్రామీణ బ్యాంక్ అదికారులు. మేన్ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్పీ‌ ఉదయ్ కుమార్ రెడ్డి నిందితుడు జెటల రమేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నుండి రూ. 20 వేల నగదు , 4 లక్షల విలువ చేసే రెండు కెమెరాలు , 80 వేల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.

కొల్లగొట్టిన సొమ్మంతా ఆన్‌లైన్ బెట్టింగుల్లో దారబోసిన ఉద్యోగి ఆదిలాబాద్ జిల్లా బేలా మండల డీసీసీబీ బ్యాంక్ స్కాం డబుల్ షాక్‌ను ఇచ్చేలా సాగింది. ఏకంగా కంచె చేను మేసిన విధంగా.. ప్రభుత్వ సొమ్ముకు భద్రత నివ్వాల్సిన బ్యాంక్ అదికారే ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఏకంగా 2.86 కోట్లను మాయం చేశాడు ఆదిలాబాద్ జిల్లా బేలా బ్రాంచిలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ కం క్యాషియర్‌గా పనిచేసిన శ్రీపతి కుమార్‌ అనే ఉద్యోగి. అదే బ్రాంచి వేునేజర్‌ రాజేశ్వర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ రణితల యూజర్ ఐడి, పాస్ వర్డ్ లాగిన్ లతో గతేడాది సెప్టెంబర్‌ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు విడతలవారిగా రూ.2.86 కోట్లను మాయం చేశాడు. ఈ సొమ్ములో రూ.1 కోటి 20 లక్షలకు పైగా తన కుటుంబీకుల ఖాతాల్లో జమచేసుకున్న శ్రీపతి కుమార్.. అక్కడితో ఆగకుండా ఆదిలాబాద్‌లోని డీసీసీబీ, ఆదిలాబాద్‌ గ్రామీణం, భీంపూర్, జన్నారంలో పనిచేసే నలుగురు మేనేజర్లతో సహా 11 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి మరో కోటీ రూపాయల డబ్బును దారి మళ్లించాడు. అయితే ఇంత యదేచ్చగా జరిగిన కోట్ల స్కాం ను అధికార యంత్రాంగం పసిగట్టలేకపోయింది. మార్చి నెల 7న బ్యాంకులో జరిగిన జనరల్ ఆడిట్‌లో ఏకంగా రూ.2.86కోట్ల లు తేడా రావడంతో అలర్ట్ అయిన చార్టెట్ అకౌంట్ ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులో 2.86కోట్ల రూపాయలకు సంబందించిన లావదేవీలకు సంబందించిన ఎలాంటి వోచర్లు లేకపోవడంతో డీసీసీబీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు నాగాంజలి, శ్రీనివాస్‌ లు అలర్ట్‌ అయి లోతుగా విచారణ చేపట్టారు. ఇందులో అసిస్టెంట్‌ కం క్యాషియర్‌గా పనిచేసే శ్రీపతి కుమార్‌ డబ్బులు కాజేసిన విషయం వెల్లడైంది. దీంతో అలర్ట్ అయిన డీసీసీబీ సీఈవో శ్రీదర్ ఈ కేసును ఆర్థిక నేరంగా భావించి ఆయా బ్యాంకుల్లోని నలుగురు మేనేజర్లతో సహా 11 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మార్చి 13 న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టి 11 మందిని అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయలు కాజేసిన శ్రీపతి కుమార్ ఆ డబ్బు నంత ఆన్ లైన్ బెట్టింగుల్లో పెట్టినట్టుగా తేలింది.

అక్రమాల ఉపాదిహామీ నిధుల గోల్‌మాల్ ఈరెండు బ్యాంకుల స్కాంల ఘటనలు మరుకవక ముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో అవినీతి భాగోతం తెర పైకి వచ్చింది. ఎన్ఆర్జీఎస్ పథకంలో లొసుగులను ఆసరగా చేసుకుని క్షేత్ర స్థాయి సిబ్బంది ఉపాది హామీ నిధులు పక్కదారి పట్టించినట్టుగా తేలింది. బోథ్ మండలం 33 గ్రామపంచాయితీల్లో ముగిసిన రెండు రోజుల సామాజిక తనిఖీల్లో ఉపాదిహామీల స్కాం పుట్ట బద్దలైంది. పథకంలో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని 1,89,32,576 రూపాయల నిధులను పక్కదారి పట్టించారు అక్కడి అదికారులు , క్షేత్ర స్థాయి సిబ్బంది. 2018 లో చనిపోయిన 10 మంది పేర్ల మీద మూడేళ్లుగా ఉపాదిహామీ కూలీ డబ్బులు డ్రా చేసిన అదికారులు రూ.60 లక్షలను కాజేసినట్టుగా జనరల్ ఆడిట్‌లో తేలింది. బోథ్ మండలంలోని అందూర్ , ధన్నూర్ , దేవుని‌ గుట్ట , బిర్లగొంది గ్రామాలలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ అవినీతి వెలుగు చూసింది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్ల మీద ఉపాదిహామీ కూలీ డబ్బులు డ్రా చేసుకున్నారు టెక్నికల్ అసిస్టెంట్ లు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు టీఎల్‌లను సస్పెండ్ చేసినట్టుగా డీఆర్డీఏ పీడీ కిషన్ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో మిగిలిన అక్రమార్కులపై చర్యలకు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా ఒకే నెల వ్యవదిలో మూడు పెద్ద అవినీతి పుట్టలు బద్దలవడం ఇటు ఆదిలాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

నరేష్ స్వేన. టీవీ9 తెలుగు ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.