Job Fraud: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో నకిలీ కాల్ లెటర్స్.. నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లు.
Job Fraud: నిరుద్యోగుల అత్యశను పెట్టుబడిగా చేసుకొని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పరీక్షలు రాయకుండా, ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా ఎంచక్కా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరొచ్చని అమాయక యువతకు గాలం వేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షల్లో దండుకుంటున్నారు...
Job Fraud: నిరుద్యోగుల అత్యశను పెట్టుబడిగా చేసుకొని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పరీక్షలు రాయకుండా, ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా ఎంచక్కా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరొచ్చని అమాయక యువతకు గాలం వేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షల్లో దండుకుంటున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా యువత మాత్రం మోసపోతూనే ఉన్నారు.
తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్న కేటుగాళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కాల్ లెటర్స్‌తో ప్రజలను మోసం చేస్తున్న కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నలుగురు వ్యక్తులు కందుకూరి కమల్, పాలేటి సత్యవరప్రసాద్, దాసి జయబాబు, ముప్పిడి జాన్‌లు నకిలీ కాల్ లెటర్స్‌తో ప్రచారం చేస్తున్నారని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నకీలీ కాల్ లెటర్స్ చూపించి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ విషయమై తుల్లూరు సీఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘హైకోర్టు సబ్‌సెక్షన్ అధికారి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నాము. గతంలో ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశాము.. వారిచ్చిన సమాచారంతో తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నాము. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచాం. నకిలీ ఉద్యోగాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలి’ అని సీఐ సూచించారు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. NIAలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. పదో తరగతి చదివిన వారు అర్హులు..!