uppula Raju |
Updated on: Mar 22, 2022 | 12:08 AM
పసుపు మరియు ఆల్మండ్ ఆయిల్: పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డెడ్ సెల్స్‌ని తొలగిస్తాయి. ఇందుకోసం ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు తీసుకుని అందులో ఒక టీస్పూన్ బాదం నూనె కలపాలి. ఈ పేస్ట్‌ను డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేసి ఆపై శుభ్రమైన గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
నిమ్మకాయ, బాదం నూనె: నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక గిన్నెలో రెండు చెంచాల బాదం నూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు నల్లటి వలయాలపై అప్లై చేసి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
విటమిన్ ఈ, బాదం నూనె: మార్కెట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి. బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉన్నప్పటికీ క్యాప్సూల్ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. రెండు చెంచాల బాదం నూనె తీసుకుని అందులో ఒక క్యాప్సూల్ మిక్స్ చేసి కళ్ల చుట్టూ అప్లై చేయాలి.
మిల్క్ పౌడర్, ఆల్మండ్ ఆయిల్: బాదంలోని లక్షణాలే కాకుండా మిల్క్ పౌడర్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. పాలపొడిలో ఉండే లాక్టిక్ యాసిడ్ నల్లటి వలయాలను తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. ఈ రెండింటిని పేస్టులా చేసి రాత్రి పడుకునే ముందు కళ్ల దగ్గర అప్లై చేసి తర్వాత సాధారణ నీటితో కడగండి.
ఆలివ్ ఆయిల్: కొన్నిసార్లు చర్మం పొడిబారడం వల్ల నిస్తేజంగా మారుతుంది. ఆలివ్ నూనె, బాదం నూనె నల్లటి వలయాలను సులభంగా తొలగించగలవు. ఇందుకోసం ఒక చెంచా బాదం నూనె, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి కళ్ల చుట్టూ రాసుకోవాలి. కొద్ది రోజుల్లో తేడాను గమనిస్తారు.