Girl Murder: పాకిస్తాన్‌లో దారుణం.. 18 ఏళ్ల హిందూ యువతిని కాల్చి చంపిన దుండగులు

పాకిస్థాన్‌లో ఆకతాయిల అరాచకాలు ఆగడంలేదు. మైనారిటీలపై అఘాయిత్యాల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ మైనర్ బాలిక పట్ల తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు.

Girl Murder: పాకిస్తాన్‌లో దారుణం.. 18 ఏళ్ల హిందూ యువతిని కాల్చి చంపిన దుండగులు
Hindu Girl
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 22, 2022 | 9:54 AM

Hindu Girl Shot Dead: పాకిస్తాన్‌(Pakistan)లో ఆకతాయిల అరాచకాలు ఆగడంలేదు. మైనారిటీలపై అఘాయిత్యాల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ మైనర్ బాలిక(Minor Girl) పట్ల తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. సోమవారం 18 ఏళ్ల హిందూ యువతిని కాల్చి చంపారు. నిందితులు బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, అయితే అది సఫలం కాకపోవడంతో నిందితుడు కాల్చి చంపాడని స్థానికులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని సింధ్‌కు చెందిన రోహి సుక్కుర్‌‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సింధ్‌లోని సుక్కుర్‌లో అపహరణ, మతమార్పిడిని ప్రతిఘటించినందుకు పూజా కుమారి ఓద్ అనే 18 ఏళ్ల యువతిని వాహిద్ లాషారీ కాల్చి చంపాడు. పూజా కిడ్నాప్‌కు యత్నించిన వారిపట్ల తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెను మార్గమధ్యంలో ఆమెపై దాడి చేసి కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా సింధ్‌లోని హిందూ మహిళలను అపహరించి, బలవంతంగా మతం మార్చుకుంటారు. మతఛాందసవాదుల దాటికి ఐదేళ్లలో 156 కేసులు నమోదయ్యాయి. తాజాగా పూజ హత్య తర్వాత పాక్‌లో హిందువులు వణుకుతున్నారు.

మైనారిటీల హక్కుల కోసం పీపుల్స్ కమిషన్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రకారం, 2013 నుంచి 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిడుల కేసులు నమోదయ్యాయి. 2019లో సింధ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పిడులు, రెండవ వివాహాలకు వ్యతిరేకంగా బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ ఛాందసవాదులు దీనిని వ్యతిరేకించారు. ప్రతి రోజూ హిందూ, క్రైస్తవ అమ్మాయిలను అపహరణలు, బలవంతపు మతమార్పిడులు, పెళ్లిళ్లు చేసి పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర వహిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో హిందువుల జనాభా మొత్తం జనాభాలో 1.60%. 6.51% మంది హిందువులు సింధ్‌లోనే నివసిస్తున్నారు. పాకిస్తాన్‌లో హిందువులు ప్రధాన మైనారిటీ సమాజం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే వారి జనాభా 9 మిలియన్లు అని హిందూ సమాజం చెబుతోంది. ఇక్కడ వారు తమ సంస్కృతి, భాషలను ముస్లింలతో పంచుకుంటారు. అయితే ఈ ప్రావిన్స్ నుండి హిందూ మహిళలపై అఘాయిత్యాల వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.

Read Also…  Buchi Babu Sana : బుచ్చిబాబు సినిమాలో యంగ్ టైగర్ ఆ పాత్రలో కనిపించనున్నారట.. ఫ్యాన్స్‌కు పూనకాలే