Anantapur: అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం.. యువకుడిని నరికి చంపిన అమ్మాయి బంధువులు
ప్రేమికులపై పగబట్టిన పరువు కత్తి, అనంతపురం జిల్లాలో పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.
Defamation Murder: ప్రేమికులపై పగబట్టిన పరువు కత్తి, అనంతపురం(Anantapur) జిల్లాలో పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది. చెల్లెలు తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ఆమె భర్తను అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలో ఈ దారుణం జరిగింది. డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి, తమ చెల్లెలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడన్న కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వెంకటాంపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి మొదటి భార్యతో విడిపోయిన తర్వాత, ప్రేమ వివాహం చేసుకుని పామిడి మండలం కొనేపల్లిలో ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. నరేంద్ర ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ చెడిపోయిందని, డ్రైవర్ తెలుపడంతో దాని మరమ్మత్తు కోసం నరేంద్ర..రెండేళ్ల తర్వాత వెంకటంపల్లికి వెళ్లాడు. పని ముగించుకొని బైక్‌పై తిరిగి వెళ్తుండగా, ఇదే అదునుగా భావించి అమ్మాయి బంధువులు దాడి చేశారు. గ్రామంలో అతన్ని దారుణంగా నరికి చంపారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హత్య చేసిన దుండగులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
అయితే, పరువు కోసమే మా అన్నలు నా భర్తను చంపారని నరేంద్ర భార్య కుళ్లాయమ్మ తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని ఉరి తీయాలన్నారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతోనే ఇలా చేశారన్నారు. తమ కూతురికి మరికొన్ని రోజుల్లో నామకరణం చేయాలనుకున్నామని, ఇంతలో ఈ దారుణం జరిగిందన్నారు. నాకు, నా కూతురు, అమ్మకు కూడా ప్రాణహాని ఉందని కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరయ్యారు..
Read Also…. Viral Video: వామ్మో! భారీ కొండచిలువతో బుడ్డోడి ఆటలు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే