Viral Video: వామ్మో! భారీ కొండచిలువతో బుడ్డోడి ఆటలు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
వీడియాలో, దాదాపు రెండేళ్ల చిన్నారి ఒక పెద్ద కొండచిలువపై కూర్చుని దానితో ఆడుకోవడం కనిపిస్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన తర్వాత మీ కళ్లను మీరు నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది (Shocking Video). మీరు చూసింది నిజమేనా అనే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ వీడియో చూసిన వారెవరైనా షాక్‌కు గురి కావాల్సిందే. ఈ వైరల్ వీడియో క్లిప్‌లో, ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద కొండచిలువ (Python and Kid Video) పైన కూర్చుని ఆడుకుంటూ కనిపించాడు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. పాము ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. వైరల్‌గా మారిన క్లిప్‌లో, ఓ చిన్న పిల్లవాడు ఇంటి ముందు, బొమ్మలాగా కనిపించే ఓ భారీ కొండచిలువ పైన ఆడుకుంటున్నట్లు చూడొచ్చు. ఈ దృశ్యాన్ని చూస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. పిల్లవాడు కొండచిలువపై కూర్చొని సరదాగా ఉండటాన్ని మీరు చూడొచ్చు. ఆ తరువాత ఈ వీడియోలో భారీ కొండ చిలువను మనం పూర్తిగాచూడొచ్చు. అయితే ఆ చిన్నారికి మాత్రం ఈ పామంటే భయం లేదనిపిస్తోంది.
చాలా ఆశ్చర్యకరమైన ఈ వీడియో Instagramలో rasal_viper అనే ఖాతాతో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ’10 సెకన్ల వీడియో చేయడానికి, బిడ్డను మృత్యువుకి దగ్గర చేస్తారా’ అంటూ తీవ్రంగా మండిపడుతూ కొందరు కామెంట్లు చేశారు. ‘కొండచిలువ పిల్లలకి హాని కలిగించనంత కాలం చూడటానికి సరదాగా ఉంటుంది’ అంటూ మరొకరు రాశారు. వీడియో తీసిన వ్యక్తిని జైలుకు పంపాలంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఓవరాల్‌గా ఈ వీడియో చూసిన తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రుల గురించి, వీడియో క్రియేటర్ గురించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?
