Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. బుడ్డోడికి ఎన్ని కష్టాలోచ్చాయో..! ఫన్నీ వీడియో వైరల్

Kid Sleeping In Class: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో

Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. బుడ్డోడికి ఎన్ని కష్టాలోచ్చాయో..! ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2022 | 9:54 PM

Kid Sleeping In Class: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్న పిల్లాడి వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు తమ బాల్యం గుర్తుకు వస్తుందంటూ తెగ నవ్వుకుంటున్నారు. అందరూ పెద్దయ్యాక చిన్ననాటి విషయాలను గురించి ఎక్కువగా మిస్ అవుతుంటారు. సాధారణంగా బాల్యాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్నతనంలో సరదాగా గడిపేవాడినని.. మళ్లీ బాల్యం తిరిగి వస్తే బాగుంటుందని పేర్కొంటుంటారు. స్కూల్లో అయినా, ఇంట్లో అయినా ఏదో ఒక అల్లరి చేస్తుండేవాడినని చెప్పుకుంటుంటారు. పెద్దయ్యాక అలాంటి అల్లరిని చాలా మిస్ అవుతుంటారు. స్కూల్లో చాలా మంది పిల్లలు కూర్చొని కునుకు తీయడాన్ని మనం చూసి ఉంటాం.. అలా చేసి కూడా ఉంటాం.. మధ్యాహ్న భోజనం తర్వాత ఇది చాలా మంది పిల్లల్లో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నప్పటికీ.. తాజాగా ఒక పిల్లవాడు నిద్రపోతున్న వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. దీన్ని చూస్తే మీరు మీ బాల్యాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవడం ఖాయం.

వైరల్ వీడియోలో.. క్లాస్‌లో పిల్లలు కుర్చుని ఉండటాన్ని చూడవచ్చు. పిల్లలందరి దృష్టి టీచర్‌పై ఉంది. అయితే ఈ చివరన కూర్చున్న పిల్లవాడు కునుకు తీసే పనిలో బిజీగా ఉన్నాడు. కుర్చీలో కూర్చొని హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు. రాత్రి నిద్ర పోకుండా.. ఉదయం స్కూల్ కి వచ్చినట్టు కనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు.. పిల్లవాడు అటు ఇటు తులుతూ కనిపిస్తాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో.. 

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 11 వేలకుపైగా వీక్షించగా.. వందలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో, పలు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. బాల్యం గుర్తుకువస్తుందంటూ నవ్వుకుంటున్నారు.

Also Read:

Viral Video: తప్పించుకోవడం ఇంత ఈజీనా..! లాకప్ నుంచి ఖైదీ ఎలా ఎస్కేప్ అయ్యాడో చూస్తే మైండ్ బ్లాంకే..

Viral Video: ప్రాంక్ పేరుతో వెర్రి వేశాలు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈ వీడియో చూస్తే సమ్మగా ఉండటం ఖాయం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో