Viral Video: ప్రాంక్ పేరుతో వెర్రి వేశాలు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈ వీడియో చూస్తే సమ్మగా ఉండటం ఖాయం..

Prank Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొంతమంది తక్కువ కాలంలోనే ఫేమస్ అవ్వాలనే

Viral Video: ప్రాంక్ పేరుతో వెర్రి వేశాలు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈ వీడియో చూస్తే సమ్మగా ఉండటం ఖాయం..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2022 | 7:05 PM

Prank Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొంతమంది తక్కువ కాలంలోనే ఫేమస్ అవ్వాలనే ఆలోచనలతో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. కొన్ని ప్రాంక్‌లు సరదాగా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాక్‌కి గురిచేస్తుంటాయి. ఇలా ప్రాంక్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న యువకుడికి.. ఓ వ్యక్తి దిమ్మతిరిగే షాకిచ్చాడు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో చేసే సరదా, అసహ్యకరమైన ప్రాంక్‌లు వీడియోలను మనం చూస్తునే ఉంటాం.. కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్.. ఇది మంచిదా..? కాదా..? అని ఆలోచించకుండా ఏమైనా చేస్తారు. అలా చేసి చిక్కుల్లో పడుతుంటారు. అలానే ఓ వ్యక్తి టిక్‌టాక్‌లో ఫేమస్ అవ్వడం కోసం చేసిన ప్రాంక్.. అతనికే బుద్ది చెప్పింది. చివరకు ఆ యువకుడు ఆసుపత్రికి చేరేంత పని అయ్యింది.

టిక్‌టాకర్‌ జైకిందాఫన్నీ8 ఎల్లప్పుడూ ప్రాంక్ వీడియోలను చేస్తూ యూజర్లను నవ్విస్తుంటాడు. అయితే.. అతని చిలిపి చేష్టలను చూసి యూజర్లు అతన్ని జే అంటూ పిలుస్తుంటారు. ఈ క్రమంలో ఓ సూపర్ మార్కెట్‌లో ప్రాంక్ చేస్తాడు. ఓ వ్యక్తి చెవి దగ్గర జే.. PVC పైపును పెట్టి అరుస్తాడు. వెంటనే.. ఆ వ్యక్తి అతన్ని పట్టుకొని చితక్కొడతాడు. అంతేకాకుండా కిందపడేసి జేపై దాడి చేస్తాడు. దీంతో ప్రాంక్ కాస్త.. రివర్స్ అయింది.. జే పరిస్థితి ఆసుపత్రి వరకు వెళ్లిందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో.. 

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే అనుమతి లేకుండా ఒకరిని తాకడం దాడి.. వారితో ఆటలాడటం ప్రమాదమంటూ వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను 5 మిలియన్ల మంది వీక్షించడంతోపాటు లైక్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త.. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..!

Viral Video: వయ్యారాలు ఒలకబోస్తూ కచ్చా బాదం పాటకు యువతి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!