Viral Video: భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త.. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..!

భార్య భర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఒక క్షణం టామ్ అండ్ జెర్రీలా పోట్లాడి.. మరుక్షణం పాలు నీళ్లలా కలిసిపోతారు.

Viral Video: భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త.. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..!
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2022 | 6:49 PM

భార్య భర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఒక క్షణం టామ్ అండ్ జెర్రీలా పోట్లాడి.. మరుక్షణం పాలు నీళ్లలా కలిసిపోతారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. పెళ్లి తరువాత.. భర్తకు భార్య, భార్యకు భర్తే సర్వస్వం అన్నట్లుగా ఉంటారు. అయితే, కొందరు భార్యభర్తలు చాలా అన్యోన్యంగా, చూడముచ్చటగా ఉంటారు. వారి మధ్య ప్రేమ ఆకాశమంత ఉంటుంది. ఈ ప్రేమను కొందరు తమ చేతల ద్వారా వ్యక్తం చేస్తే.. మరికొందరు మాటల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇంకొందరు బహుమతులు ఇవ్వడం ద్వారా వ్యక్తం చేస్తారు. అయితే, వివాహ బంధంలో భార్యభర్తలు ఇద్దరికీ అపురూప ఘట్టం ఏదైనా ఉందంటే.. అది ప్రెగ్నెన్సీ. తాము తల్లిదండ్రులు అవబోతున్నామని తెలిసిన క్షణం వారిలో కలిగే అనుభూతి కోట్లు వెచ్చించినా రాదు. అలాంటి అనుభూతినే ఈ దంపతులు పొందారు. అయితే, ఈ ఆనంద క్షణాలను తన భర్తలో వినూత్నంగా పంచుకోవాలని భావించి ఓ భార్య. తాను గర్భిణి అయిన సందర్భంగా భర్తకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది.. ఓ భర్త తన భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి షాకయ్యాడు.. చిన్న పిల్లాడిగా మారిపోయి ఏడ్చాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసుకుందామా.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల లిస్టులో లంబోర్గినీ కార్లు ముందుంటాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారును తన భర్తకు బహుమతిగా ఇచ్చింది.. ఆ కారు పేరు లంబోర్గిని హురాకాన్ ఈవో. ఇండియాలో ఈ కారు ధర ఏకంగా రూ. 3.21 కోట్లు. ఇంతటి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడానికి చాలా పెద్ద కారణమే ఉంది.. ఆమె మొదటిసారి ప్రెగ్నెంట్ కావడం ఒకటి.. మరొకటి.. తనకు ఎల్లప్పుడూ సహయంగా తోడుగా ఉండడం. అసలు విషయం ఏంటంటే.. అనెస్ అయునీ ఒస్మాన్ అనే 19 ఏళ్ళ అమ్మాయి మలేషియాకు చెందిన కాస్మొటిక్ బిజినెస్ ఉమెన్. ఈమె అక్కడి వ్యాపారవేత్త అయిన 20 ఏళ్ల వెల్డాన్ జుల్కెఫ్లీని గతేడాది మార్చిలో పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి గర్భవతి.. అయితే మలేసియా సంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత వందరోజులపాటు తల్లి ఎక్కడికీ వెళ్లదు. ఏ పని చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా చేయడం వలన ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం.

అయితే ఆమెకు సంబంధించిన అన్ని పనులను భర్తే చేయాల్సి ఉంటుంది. పిల్లలను చూసుకోవడం.. వారికి న్యాప్కిన్స్ మార్చడం.. పడుకోబెట్టడం వరకు అన్ని పనులు అతనే చేయాల్సి ఉంటుంది. దీంతో అతనికి వందరోజులపాటు సరిగ్గా నిద్ర.. విశ్రాంతి ఉండదు.. అలాగే..ఆమె ఓ పిల్లిని కూడా పెంచుకుంటుంది.. ఇకపై ఆ పిల్లి పనులు కూడా తన భర్తే చేయాల్సి ఉంటుంది. తన కోసం తన భర్త వందరోజులు నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది.. అందుకు కృతజ్ఞతగా ఆమె తన భర్తకు లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చి తన ప్రేమను తెలియజేసింది. ఈ క్రమంలో లంబొర్గిని కార్ల షోరూంకు తన భర్త కళ్లకు మాస్కును అడ్డు పెట్టి తీసుకెళ్లింది. మాస్క్ తీసేసిన తర్వాత అతని ఎదురుగా బ్లూ లగ్జరీ కలర్ కారు.. భారీ రెడ్ బౌతో ఉంది. అదే నీ గిఫ్ట్ అని చెప్పగానే అతను ఆనందంతో ఏడ్చేసాడు. ఆమెను అప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. థ్యాంక్యూ భర్త గారు.. ఇది ఎంత ఖరీదైన బహుమతి కావచ్చు… కానీ మీరు నా మీద చూపించే ప్రేమకు సరిపోదు అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో పై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు  మారిపోతుంటాయంటూ..

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..

భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..