AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తప్పించుకోవడం ఇంత ఈజీనా..! లాకప్ నుంచి ఖైదీ ఎలా ఎస్కేప్ అయ్యాడో చూస్తే మైండ్ బ్లాంకే..

Prisoner Escaped Video: జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు ఎన్నో వేశాలు వేస్తుంటారు. చాలా తెలివితో.. సృజనాత్మకతో అక్కడి నుంచి తప్పించుకుంటుంటారు. అయితే.. తాజాగా

Viral Video: తప్పించుకోవడం ఇంత ఈజీనా..! లాకప్ నుంచి ఖైదీ ఎలా ఎస్కేప్ అయ్యాడో చూస్తే మైండ్ బ్లాంకే..
Prisoner Escaped From Jail
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2022 | 9:12 PM

Share

Prisoner Escaped Video: జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు ఎన్నో వేశాలు వేస్తుంటారు. చాలా తెలివితో.. సృజనాత్మకతో అక్కడి నుంచి తప్పించుకుంటుంటారు. అయితే.. తాజాగా.. ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాన్ని అవలంభించాడో తెలిపే ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌లోని చకన్ పోలీస్ స్టేషన్ లాక్-అప్ నుంచి నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడనే విషయంపై పోలీసులు జట్టు పీక్కున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని మళ్లీ పట్టుకుని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

అయితే.. నిందితుడు ఎలా తప్పించుకున్నాడన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలా పారిపోయావు అంటూ నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. అతను పోలీసులకు లైవ్ డెమో ఇచ్చాడు. దొంగ చాలా సన్నగా ఉండడంతో జైలు కడ్డీల మధ్య నుంచి తేలిగ్గా బయటపడ్డాడు. కొన్ని సెకన్ల వ్యవధిలో నిందితుడు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు షాకవ్వడంతోపాటు.. సరదా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

అయితే.. దొంగ బయటపడిన విషయం గురించి పోలీసులు అధికారులకు తెలియజేశారు. ఈ వీడియో చూసి అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అన్ని పోలీసు స్టేషన్‌లకు అలెర్ట్ జారీ చేశారు.

Also Read:

Viral Video: ప్రాంక్ పేరుతో వెర్రి వేశాలు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈ వీడియో చూస్తే సమ్మగా ఉండటం ఖాయం..

Viral Video: భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త.. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..!