Women Protest – Gas Price Hikes: వంటింట్లో గ్యాస్ ధరల మంట.. భగ్గుమన్న మహిళా లోకం.. రోడ్డుపైకి వచ్చి..
Women Protest - Gas Price Hikes: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి సామాన్యుడి ఇంట్లో మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరలు..
Women Protest – Gas Price Hikes: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి సామాన్యుడి ఇంట్లో మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో దేశీయ వంట గ్యాస్ ధర సిలిండర్ కు 50 రూపాయల చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు సర్వీస్ చార్జీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 1050 రూపాయలకు చేరింది. అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను తొలిసారి పెంచారు. గ్యాస్ ధరల పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఆందోళనకు దిగారు. గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో యావత్ మహిళా లోకం ధర్నాలు చేశారు. పదేపదే గ్యాస్ ధర పెంచతూ సామాన్యుల బతుకులు చిద్రం చేస్తున్నారంటూ శ్రీకాకుళంలో మహిళలు ఆందోళనకు దిగారు.
ఏది కొనాలన్నా కంటతడి పట్టించే పరిస్థితులు నెలకొన్న యంటూ శాపనార్థాలు పెట్టారు. పెంచిన వంట గ్యాస్ ధరలకి నిరసనగా మెదక్‌లో మహిళలు రోడ్డెక్కారు. సిద్దిపేటలో మహిళ విభాగం వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిలెండర్ తో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. రోడ్డు పై కట్టల పోయి పెట్టి వంట చేశారు మహిళలు. ఇక పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 349 రూపాయలు కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ 669 రూపాయలుగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు 2004 రూపాలకు చేరింది. పెరిగిన గ్యాస్ ధరలు 22వ తేదీ నుండే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
Also read:
Kashmir Files: ఆ డబ్బునంతా కశ్మీర్ పిండిట్లకు ఇవ్వమన్న ఐఏఎస్.. డైరెక్టర్ అగ్నిహోత్రి రియాక్షన్ ఇదీ..
Big News Big Debate: తెలంగాణలో మళ్లీ మొదటికొచ్చిన వరి యుద్ధం.. TRS-BJP వ్యూహం ఏమిటో..?
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..