Traffic Challan: ఖజానాకు కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్‌ చలాన్లు.. 20 రోజుల్లో 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌..

ట్రాఫిక్‌ చలాన్‌లు ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 31 వరకు చలాన్లపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. దీంతో వసూళ్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇరవై అంటే ఇరవై రోజుల్లో..

Traffic Challan: ఖజానాకు కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్‌ చలాన్లు.. 20 రోజుల్లో 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌..
Traffic Challan
Follow us

|

Updated on: Mar 22, 2022 | 9:36 PM

ట్రాఫిక్‌ చలాన్‌లు(Traffic Challan) ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 31 వరకు చలాన్లపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Hyderabad Traffic Police) భారీ డిస్కౌంట్‌(Mega Discount Offer) ఇచ్చారు. దీంతో వసూళ్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇరవై అంటే ఇరవై రోజుల్లో ఖజానాకు వచ్చిందెంతో తెలుసా? హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌పై తిరిగొచ్చారా? ఒకసారి ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌ చూసుకోండి. రైడింగ్‌ వితవుట్‌ హెల్మెంట్‌ అంటూ ఫొటోతో సహా మీకు ఫైన్‌ పడే ఉంటుంది. ఎక్కడా ట్రాఫిక్‌ పోలీసుల కంటపడలేదే అనుకోకండి. ఏ రోడ్డు మలుపులోనో ఉన్న కానిస్టేబుల్‌ ‘క్లిక్‌’మనిపిస్తాడు. ఓవర్‌ స్పీడింగ్‌ నుంచి డ్రంకెన్‌ డ్రైవ్‌ వరకు రకరకాల ఉల్లంఘనలకు మోటార్‌ వెహికిల్‌ చట్టం కింద జరిమానాలు ఉన్నాయి. రోడ్లపై ప్రజల సేఫ్టీ కోసం ఈ రూల్స్‌ పెట్టారు. కానీ కొందరు రూల్స్‌ పాటించడం లేదు. హెల్మెట్‌ పెట్టుకోకుండా రోడ్డెక్కే వాళ్లకి లెక్కేలేదు. కొందరు మద్యం మత్తులో కార్లు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈమధ్య జూబ్లీహిల్స్‌, గచ్చీబౌలి ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. దీంతో ట్రాఫిక్‌ రూల్స్‌ని బ్రేక్‌ చేసే వారిపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఎవర్నీ వదిలిపెట్టకుండా చలాన్‌లు ఇష్యూ చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలాన్‌లతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు వస్తున్నాయి. మార్చి 1 నుండి 20 వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో కోటీ 20 లక్షల చలాన్‌లు క్లియర్ అయ్యాయి.

దీంతో ఖజానాకు జంట నగర వాహనదారుల నుండి దాదాపు 113 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 64 లక్షల చలాన్‌లు క్లియర్ అయ్యాయి. వీటి నుంచి 49 కోట్ల 60 లక్షల రూపాయల ఫైన్‌లు వసూలయ్యాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 38 లక్షల చలాన్‌లు క్లియర్ అయ్యాయి.

వీటి ద్వారా 45 కోట్ల 84 లక్షల రూపాయలు జరిమానాల రూపంలో వచ్చాయి. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 16 లక్షల చలాన్‌లు క్లియర్ అయ్యాయి. వీటి నుంచి 15 కోట్ల 50 లక్షల రూపాయల ఫైన్‌లు వసూలయ్యాయి.

ఇవి కూడా చదవండి: Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..

Axis Bank: ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. కీలక నిర్ణయం తీసుకున్న మరో బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..