Kashmir Files: ఆ డబ్బునంతా కశ్మీర్ పిండిట్లకు ఇవ్వమన్న ఐఏఎస్.. డైరెక్టర్ అగ్నిహోత్రి రియాక్షన్ ఇదీ..
Kashmir Files: బాలీవుడ్ మూమీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘దీ కశ్మిర్ ఫైల్స్’ సినిమా యావత్ భారత దేశాన్ని షేక్ చేస్తోంది.
Kashmir Files: బాలీవుడ్ మూమీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘దీ కశ్మిర్ ఫైల్స్’ సినిమా యావత్ భారత దేశాన్ని షేక్ చేస్తోంది. జమ్మూకశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న దురవస్థకు అద్దంపట్టేలా తీసిన ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, బాక్సాఫీస్ వద్ద కూడా తిరుగులేనిదిగా నిలుస్తోంది. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా కలెక్షన్స్ భారీగా వస్తున్న నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ స్పందించారు. చిత్ర నిర్మాతను ఒక కోరిక కోరారు. సినిమాపై వస్తున్న లాభాన్నంతా కశ్మీరీ పండిట్ల పిల్లల చదువులతో పాటు కశ్మీర్‌లో వారికి గృహాల నిర్మాణం కోసం విరాళంగా ఇవ్వాలని కోరారు.
‘‘ది కశ్మీర్ ఫైల్’ సినిమా ఆదాయం రూ. 150 కోట్లకు చేరుకుంది. ఇది నిజంగా అద్భుతం. కశ్మీరీ బ్రాహ్మణులు ఎదుర్కొన్న బాధలకు యావత్ దేశ కదిలిపోయింది. సినిమా నిర్మాత.. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని కశ్మీరీ బ్రాహ్మణ పిల్లల చదువులకు, కశ్మీర్‌లో వారి కోసం గృహాల నిర్మాణానికి విరాళం ఇస్తే బాగుంటుంది. ఇది గొప్ప దాతృత్వం అవుతుంది.’ అని ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ట్వీట్ చేశారు.
కాగా, నియాజ్ ఖాన్ అభ్యర్థనకు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. మార్చి 25వ తేదీన తాను భోపాల్ వస్తానని చెప్పారు. సమాజానికి ఏ విధమైన సహాయం చేయాలనే అంశాలను చర్చించడానికి నియాజ్ ఖాన్ అపాయింట్‌మెంట్ కోరారు.‘‘సర్.. నియాజ్ ఖాన్. మార్చి 25న భోపాల్ వస్తున్నాను. అపాయింట్‌మెంట్ ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. మేం ఎలా సహాయం చేయాలి, మీరు రాసే పుస్తకాల ద్వారా వచ్చే రాయల్టీ, ఐఏఎస్ అధికారిగా మీ శక్తితో ఎంత వరకు మేలు చేయొచ్చో పరస్పరం ఆలోచనలను షేర్ చేసుకోవచ్చు.’ అంటూ ట్వీట్ చేశారు
కాగా, అంతకు ముందు కూడా కశ్మీర్ పండిట్ల సమస్యలపై ఐఏఎస్ నియాజ్ ఖాన్ ట్వీట్ చేశారు. “కశ్మీర్ ఫైల్ బ్రాహ్మణుల బాధను చూపిస్తుంది. వారిని సకల గౌరవాలతో కాశ్మీర్‌లో సురక్షితంగా జీవించే ఏర్పాట్లు చేయాలి. అలాగే, అనేక రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో ముస్లింల హత్యలు జరుగుతున్నాయి. వాటిని కూడా చూపించడానికి నిర్మాత తప్పనిసరిగా సినిమా తీయాలి. ముస్లింలు ఏమీ కీటకాలు కాదు. వాళ్లు కూడా ముషులు, దేశ పౌరులే.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ఐఏఎస్ ఆఫీసర్ నియాజ్ ఖాన్ మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ మారణకాండ, తలాక్ తాలక్, బీ రెడీ టు డై సహా ఏడు నవలలను రచించారు.
Sir Niyaz Khaan Sahab, Bhopal aa raha hoon 25th ko. Please give an appointment so we can meet and exchange ideas how we can help and how you can help with the royalty of your books and your power as an IAS officer. https://t.co/9P3oif8nfL
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022
Also read:
Big News Big Debate: తెలంగాణలో మళ్లీ మొదటికొచ్చిన వరి యుద్ధం.. TRS-BJP వ్యూహం ఏమిటో..?
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..