AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Raashi Khanna: మద్రాస్‌ కేఫ్‌తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..
Raashi Khanna
Basha Shek
|

Updated on: Mar 23, 2022 | 6:35 AM

Share

Raashi Khanna: మద్రాస్‌ కేఫ్‌తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా రాశిఖన్నా (Raashi Khanna) బాలీవుడ్‌లో నటించిన తాజా సిరీస్‌ రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ ( Rudra: The Edge of Darkness). అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ఈ బాలీవుడ్‌ క్రైమ్‌ డ్రామాలో అలియా చోక్సి అనే పాత్రలో నటించి మెప్పించింది రాశి. కాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కెరీర్‌ తొలినాళ్లలో తాను పడిన కొన్ని ఇబ్బందులను గుర్తు చేసుకుంది.

అలా బరువు తగ్గాను..

కాగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో కొంచెం బొద్దుగా ఉండేది రాశి. దీంతో చాలామంది ఆమెను వెక్కిరంచేవారట. ‘కెరీర్‌ ఆరంభంలో నే నాకు చాలామంచి పాత్రలు వచ్చాయి. అందుకు నేనేంతో అదృష్టవంతురాలిని. అయితే నా సినిమా కెరీర్‌ పూలపాన్పేమీ కాదు. చాలామందిలాగే నేను బాడీషేమింగ్‌ కామెంట్లు ఎదుర్కొన్నాను. బొద్దుగా ఉండడం వల్ల కొంతమంది నన్ను ‘గ్యాస్‌ ట్యాంకర్‌’ అని వెక్కిరించారు. నేను అలా కనిపించడానికి నా ఆరోగ్య సమస్యలే కారణం. పీసీఓడీ అనే సమస్య నన్ను ఇబ్బంది పెట్టింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. అందుకే అటు సినిమా పరిశ్రమలో, ఇటు సొషల్ మీడియాలో నన్ను గ్యాస్ ట్యాంకర్‌ తో పోల్చుతూ ట్రోలింగ్ చేసేవారు. ఆ సమయంలో నా బరువు గురించి వీళ్లంతా ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారనిపించేది. కొన్నాళ్లు బాగా బాధపడ్డాను. అయితే వారి కోసం కాకుండా నేను కోరుకున్న రంగంలో విజయం సాధించేందుకు, అందంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. క్రమం తప్పకుండా జిమ్‌ కు వెళ్లి చక్కటి శరీరాకృతి, ఫిట్‌నెస్‌ సాధించాను’ అని అప్పటి సంగతులను గుర్తు తెచ్చుకుంది ఈ సౌందర్య రాశి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్‌ చిత్రంలో నటిస్తోంది రాశి. దీంతోపాటు నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. వీటితో పాటు సర్దార్‌ (తమిళం), యోధా(హిందీ), షైతాన్‌ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాలతార.

Also Read:RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..

Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల బైక్ జర్నీ.. 27 దేశాలను అనుసంధానిస్తూ ప్రయాణం.. ఎందుకో తెలుసా..

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!