Prashanth: రెండోసారి పెళ్లిపీటలెక్కునున్న ‘జీన్స్’ ప్రశాంత్!.. అమ్మాయి ఎవరంటే..
ప్రముఖ నటుడు, నిర్మాత త్యాగరాజన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ (Prashanth). స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన జీన్స్ (Jeans) చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రముఖ నటుడు, నిర్మాత త్యాగరాజన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ (Prashanth). స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన జీన్స్ (Jeans) చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత కూడా దొంగ దొంగ, జోడీ, ప్రేమ శిఖర, తొలిముద్దు చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆతర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. కొన్ని రోజులకు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో 2019లో విడుదలైన వినయవిధేయరామ చిత్రంలో రామ్‌చరణ్‌కు సోదరుడిగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలోనే అంధాధూన్ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ప్రశాంత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ఈయన రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
కాగా 2005లో ఓ వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్ పెళ్లి జరిగింది. ఆమరుసటి ఏడాదే వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే మనస్పర్థల కారణంగా2008లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు ప్రశాంత్. అయితే తాజాగా వారి కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయిని అతను పెళ్లాడనున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంధాధూన్ రీమేక్ పూర్తవ్వగానే అధికారికంగా తన రెండో పెళ్లి గురించి ప్రకటిస్తాడని సమాచారం.Also Read: వేసవిలో కర్బూజతో ఉపయోగాలు..