Side Effects of Soft Drinks: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?

Side Effects of Soft Drinks: శీతాకాలంలో చాలా మంది శీతల పానీయాలు తీసుకుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల డ్రింగ్‌లను సేవిస్తుంటారు. కానీ..

Side Effects of Soft Drinks: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2022 | 10:00 AM

Side Effects of Soft Drinks: శీతాకాలంలో చాలా మంది శీతల పానీయాలు తీసుకుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల డ్రింగ్‌లను సేవిస్తుంటారు. కానీ శీతల పానీయాలు కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయని ఆరోగ్య (Health) నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎండాకాలంలో (Summer) ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వడదెబ్బ (Sunstroke) ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్‌ బారిన పడుతుంటారు. షుగర్‌ సోడాలు, ఇతర పానీయాల వల్ల శరీరంలో సమస్య ఏర్పడుతుంది. ఇవి రోజువారీలో అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఊబకాయం, టైప్‌ -2 డయాబెటిస్‌, బరువు పెరగడం వంటివి శీతలపానీయాల వల్ల వస్తుంటాయి. అలాగే మీ దంతాలకు హాని కలిగిస్తాయి. దంతక్షయాయినిక దారితీయవచ్చు. మీ నోటిలోని సూక్ష్మ జీవులతో చర్య జరిపి యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

శీతల పానీయాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం..

  1. బరువు పెరుగుట: ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శీతల పానీయాల వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. సోడాలు, శీతల పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది. ఒక కోకాకోలా బాటిల్‌లో 8 టీస్పూన్ల చక్కెర ఉంటుంది. శీతల పానీయాలు మీ దాహార్తిని తీర్చవచ్చు. కానీ ఆకలిని తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
  2. మధుమేహానికి కారణం కావచ్చు: ఇన్సులిన్‌ హర్మోన్‌ ప్రధాన పని మీ రక్తప్రవాహం నుంచి మీ కణాలకు గ్లూకోజ్‌ను రవాణా చేయడం. మీరు రోజూ శీతలపానీయాల రూపంలో చక్కెరను తీసుకుంటే సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తంలో ఇన్సులిన్‌ స్పైక్‌ అవుతుంది. సోడాలో చక్కెర ఎక్కువగా ఉన్నందున ఇన్సులిన్‌ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా శీతల పానీయాల ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ వచ్ఏచ అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు తెలియజేశాయి.
  3. ఫ్యాటీ లివర్‌: శుద్ధి చేసిన చక్కెరలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ రెండు ప్రధాన భాగాలు. గ్లూకోజ్‌ మీ శరీర కణాల ద్వారా సులభంగా గ్రహించబడుతుంది. అయితే ఫ్రక్టోజ్‌ ప్రత్యేకంగా కాలేయం ద్వారా ప్రాసెస్‌ చేయబడుతుంది. శీతల పానీయాలలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఓవర్‌లోడ్‌కు దారి తీస్తుంది. కాలేయం ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. ఇది ఓవర్‌లోడ్‌ ఫలితంగా కాలేయంలో పేరుకుపోతుంది. కొవ్వు కాలేయ వ్యాధికి కారణమవుతుంది. ఇది చాలా ప్రాణాంతకం.
  4. దంత క్షయ: శీతల పానీయాలు మీ దంతాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ దంతాలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. సోడాలలో ఫాస్పోరిక్‌, కార్బోనిక్‌ ఆమ్లాలు ఉంటాయి. రెండూ కాలక్రమేణా పంటి సమస్యలకు దారి తీస్తాయి.
  5. అధిక కేలరీలు: సాధారణ శీతలపానీయం బాటిల్‌లో దాదాపు 150-200 కేలరీలు ఉంటాయి. షుగర్‌ మీ శరీరంలో డోపమైన్‌లు సృష్టిస్తాయి. అయితే శీతలపానీయాలు తాగిన సమయంలో మీకు ఉల్లాసంగా అనిపించవచ్చు. కానీ వీటికి వ్యసనంగా మారితే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి:

Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?

Health Tips: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!