AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya Om: మన ప్రాంతం కాదు.. మన రాష్ట్రం కాదు.. కేవలం తెలుగువాళ్లు ఆదరించారని.. నువ్వయ్యా రియల్ హీరో

అతడిని నటుడిగా అక్కున చేర్చుకుంది తెలుగు ఆడియెన్స్‌. అలాంటివారికి తన వంతుగా ఏమైనా చేయాలనుకున్నాడు. అది కూడా ఏదో చిన్న.. చిన్న సేవా కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోడానికి కాదు. తన పేరు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడానికి. అందుకే ఏకంగా ఒక గిరిజన గ్రామాన్నే దత్తత తీసుకున్నాడు..

Aditya Om: మన ప్రాంతం కాదు.. మన రాష్ట్రం కాదు.. కేవలం తెలుగువాళ్లు ఆదరించారని.. నువ్వయ్యా రియల్ హీరో
Aditya Om
Ram Naramaneni
|

Updated on: Dec 27, 2024 | 9:19 AM

Share

రీల్ హీరోల మాయలో పడి.. మనం కొంతమంది రీల్ కమ్ రియల్ హీరోలను పట్టించుకోవడం మర్చిపోతున్నాం. అలాంటివారిలో ఒకరు ఆదిత్య ఓం. ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఈ  హీరో.. లాహిరి లాహిరి సినిమాతో.. తెలుగు చిత్రసీమలో తెరంగేట్రం చేశాడు. ఆయన తండ్రి ఐఏఎస్.. తల్లి సమాజ్‌వాదీ పార్టీలో కీలక నాయకురాలు. అంతేకాదు ఆయన బందుగణం అంతా బ్యూరోక్రాట్స్‌గా, జడ్జిలుగా సేవలు అందిస్తున్నారు. అయినా సినిమాలో పాత్ర కోసం.. ఆదిత్య ఓం ఎంతో కష్టపడినట్లు లాహిరి లాహిరి సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదిరి తెలిపారు. అతను ఎంతో డెడికేషన్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు.

అయితే మంచి ఆరంభమే లభించినా.. ఆదిత్య ఓం కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత అతనికి చెప్పకోగదగ్గ హిట్ పడలేదు. అయినా కానీ తనను నటుడిగా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటున్నాడు ఈ యాక్టర్. సేవా కార్యక్రమాలలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆదిత్య ఓం.. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిని దత్తత తీసుకున్నాడు. తన సంస్థ “ఎడ్యులైట్‌మెంట్”తో విద్యా సంస్కరణల కోసం కీలకంగా పని చేస్తున్నాడు. గ్రామంలో ఒక లైబ్రరీని నిర్మించాడు. డిజిటల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాడు. గ్రామంలోని పిల్లలకు   ల్యాప్‌టాప్‌లు అందిచాడు. విలేజ్ మొత్తం సోలార్ లైట్లను ఏర్పాటు చేయించాడు. చెరుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో..  కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఆదిత్య ఓం..  RO వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి వరకు ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు ఆయన వడివడిగా ముందుకు సాగుతున్నారు. అందుకే ఆదిత్య ఓంను రియల్ హీరో అని కీర్తిస్తున్నారు చెరుపల్లి గ్రామవాసులు. అతడిని ఆదర్శంగా తీసుకుని.. ఒక్కో హీరో.. ఇలా ఒక వెనకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుంటే తెలంగాణ రూపే మారిపోతుంది అంటున్నారు.

ఇటీవలే ఆదిత్య ఓం తెలుగు బిగ్ బాస్ 8లో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపే.. బంధీ అనే చిత్రం చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..