Tollywood : రోజా అక్కతో ఫుల్లుగా ఆడుకునేవాడిని.. ఒకప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈమధ్య కాలంలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలువురు బాలనటీనటులు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కొందరు బుల్లితెరపై సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు స్మాల్ స్క్రిన్ పై తెగ ఫేమస్.

పైన ఫోటోలో హీరోయిన్ రోజా పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అలాగే హీరోగా, టీవీ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా అలరించాడు. అంతేకాదు.. చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 40 సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాగే 10కి పైగా సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అతడి అన్నయ్య టీవీ రంగంలో ఫేమస్ నటుడు. ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అతడు మరెవరో కాదండి.. నటుడు బాలాదిత్య. 1996లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టి్స్టుగా నంది అవార్డ్ అందుకున్నారు. జంబలకిడి పంబ, లిటిల్ సోల్జర్స్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్
ఆ తర్వాత 2003లో చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. ఆ తర్వాత వేట, సుందరానికి తొందరెక్కువ, 1940లో ఒక గ్రామం, మా ఊరి పొలిమేర 1, 2 చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న బాలాదిత్య.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తూనే అటు సీరియల్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..
బాలాదిత్య మాట్లాడుతూ.. ” రోజా అక్కతో బాగా ఆడుకునేవాడిని. అన్న, రాయుడు గారు నాయుడు గారు సినిమాల్లో రోజా గారితో కలిసి చేశాను. రాయుడు గారు నాయుడు గారు సినిమాకు 25 రోజులు కలిసి పని చేసాము. కాకినాడ దగ్గర యానంలో షూటింగ్ జరిగింది.అప్పుడు నేను రోజా అక్కతో రోజూ కార్ లో వెళ్లి వచ్చేవాళ్లం. ఒకే రూంలో ఉండేవాళ్లం. ఆటలు, పాటలు చాలా ఎంజాయ్ చేసాము ” అని అన్నారు. ఒకసారి ఏవండీ ఆవిడొచ్చింది సినిమా షూటింగ్ సమయంలో రంభ ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో డైరెక్టర్ ఈవీవీ తనను పిలిచి ఆ డైలాగ్ చెప్పి చూపించు అని అన్నారని.. ఆ తర్వాత రంభ సరదాగా తన తల్లి దగ్గరి వచ్చి వీడ్ని షూటింగ్ కు తీసుకురాకండి అని చెప్పేదని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..
