AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinod Kambli: షాకింగ్ అప్డేట్! ఆ విషయంలో 100 శాతం గ్యారంటీ ఇవ్వలేం అని తేల్చి చెప్పిన డాక్టర్లు!

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్ ద్వివేది ప్రకారం, కాంబ్లీకి పూర్తిస్థాయి జ్ఞాపకశక్తి సాధ్యంకాదని, కానీ మంచి ట్రీట్మెంట్ ద్వారా 80-90 శాతం సాధ్యమని చెబుతున్నారు. కాంబ్లీ ప్రస్తుతం మద్యపానాన్ని మానేసి పునరావాసానికి అనుకూలంగా ఉంటున్నారు. అతనికి మంచి పోషకాహారం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అవసరమని వైద్యులు సూచించారు.

Vinod Kambli: షాకింగ్ అప్డేట్! ఆ విషయంలో 100 శాతం గ్యారంటీ ఇవ్వలేం అని తేల్చి చెప్పిన డాక్టర్లు!
Vinod Kambli
Narsimha
|

Updated on: Dec 27, 2024 | 9:14 AM

Share

భారత క్రికెట్ దిగ్గజం వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంబ్లీకి న్యూరో మార్పుల కారణంగా జ్ఞాపకశక్తి బలహీనమవుతోందని డాక్టర్ వివేక్ ద్వివేది వెల్లడించారు. కానీ, శస్త్రచికిత్స అవసరం లేకుండా, మెరుగైన పునరావాసం ద్వారా 80-90 శాతం వరకు సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంబ్లీ గతంలో మద్యం వ్యసనంతో ఇబ్బంది పడగా, మూడు నెలల క్రితం ఆ అలవాట్లను మానేశారు. ప్రస్తుతం, రోజుకు రెండు సార్లు ఫిజియోథెరపీ, పోషకాహారం, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలు అతనికి అతి ముఖ్యమని వైద్యులు తెలిపారు.

కాంబ్లీ పరిస్థితిపై డాక్టర్లు మరింత స్పష్టత ఇచ్చారు. క్రమశిక్షణతో పునరావాసాన్ని కొనసాగిస్తే, ఆయన ఆరోగ్యంలో మెరుగుదల సాధ్యమని చెప్పారు. అయితే, 100 శాతం జ్ఞాపకశక్తిని తిరిగి పొందడం కష్టం. ప్రస్తుతం, అతనికి సముచిత పర్యవేక్షణ అవసరం, దీని కోసం అతనికి ఆర్థిక సహాయం కూడా అవసరమవుతుంది అని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో ఆయన కుటుంబం, స్నేహితుల మద్దతు కీలకమని, దీన్ని కొనసాగించడమే ఆవశ్యమని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.