AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి మిగిలిపోయిన చపాతీలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? మరీ ముఖ్యంగా మధుమేహం వారికి..

రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే, ఉదయాన్నే వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం బాధితులు ఇలాంటి చద్ది చపాతీలు తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయట.

రాత్రి మిగిలిపోయిన చపాతీలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? మరీ ముఖ్యంగా మధుమేహం వారికి..
Chapatis
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2023 | 4:34 PM

కరోనా మహమ్మారి భయంతో ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధపెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు.. తాజా ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడుతున్నారు. మిగిలిపోయిన ఆహారాలు, రాత్రి చేసిన కూరలు, రోటీలు వంటివి ఏవైన సరే పక్కన పెడుతున్నారు. ఎక్కువగా వేడి వేడి ఆహారాలు, తాజా పండ్లు వంటివాటికే ప్రధాన్యతనిస్తున్నారు. కానీ, చల్లారిన రోటీలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే, ఉదయాన్నే వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం బాధితులు ఇలాంటి చద్ది చపాతీలు తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయట. ఉదయాన్నే ఆ చపాతీలను టీ లేదా ఏదైనా మంచి సలాడ్, కర్రీతో తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్‌కి మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాత్రి చేసిన చపాతీలు.. ఉదయం కాగానే పోషకాలు లేకుండా ఏం మారిపోవని వాటిలోని పోషకాలు అలానే ఉంటాయనీ.. అందుకే వాటిని తీసుకోవచ్చని చెబుతున్నారు.

హైబీపీతో బాధపడేవారు ఈ చపాతీలను 10నిమిషాలపాటు గోరువెచ్చని పాలల్లో నానబెట్టి తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. జీర్ణసమస్యలు, ACDT, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు రోజూ రాత్రి పడుకునేముందు పాలల్లో చపాతీలను నానబెట్టి ఉదయం తినడం వల్ల అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతున్నారు. రాత్రి చేసిన చపాతీలను ఉదయాన్నే ఇలా పాలల్లో నానబెట్టి తినడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోటీలో గ్లూకోజ్ పరిమాణం తగ్గుతుంది, పాలతో తింటే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. పిల్లలు సన్నగా ఉంటే, బరువు పెరగడానికి రాత్రి మిగిలిపోయిన రోటీలు తినడం అలవాటుగా చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని పాలలో వేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది.

మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా మిగిలిపోయిన చపాతీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వేసవిలో చల్లటి పాలతో ఈ రోటీని తింటే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో హీట్ స్ట్రోక్ ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఇంకా రాత్రి మిగిలిపోయిన చల్లని రొట్టెలను ఉదయాన్నే పెరుగుతో తింటే ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. పాత రోటీని లస్సీ, మజ్జిగతో తింటే కూడా చాలా మేలు జరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. చల్లటి పాలతో ఉదయం అల్పాహారంలో తినే వారు చాలా ప్రయోజనాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..