Watch Video: మానవత్వం మనుషుల్లోనే కాదు మాకూ ఉంటుంది.. పావురాలపై గుర్రం ప్రేమకు నెటిజన్లు ఫిదా..!
ఈ వీడియోను 2.3 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు మరియు 62 వేల మందికి పైగా లైక్ చేసారుమనుషులకంటే జంతువులే బెటర్ అంటూ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మానవత్వం మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ఉంటుంది. నోరులేని జంతువులు మనుషులు, తోటి మూగజీవాల పట్ల ప్రేమ, సాయం చేసే గుణాన్ని చూపిస్తుంటాయి. జంతువులు మనుషులకు సాయం చేసిన సంఘటనలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక గుర్రం పావురాలపై అమితమైన ప్రేమను కురిపించింది. వీడియోలో గుర్రం చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టారు అన్న సామెతను చాలా మంది మనుషులు నిజం చేస్తుంటారు. అలాంటి వారికి ఈ వీడియో ఒక గుణపాఠంలా కనిపించింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక గుర్రం దానం తింటూ కనిపిస్తుంది. అది తన యజమాని పెట్టిన దాణాను తింటుండగా పావురాల గుంపు ఆ గుర్రం వద్దకు చేరుకుంది. గుర్రం ఏమంటుందో అని భయపడుతూనే అక్కడ పడిన గింజలను తినసాగాయి పావురాలు. సాధారణంగా జంతువులు తాము తింటున్న ఆహారం వైపు ఇతర పక్షులు వస్తే వాటిని అరిచి తరిమేస్తాయి. కానీ ఈ గుర్రం అలా చేయలేదు. పావురాలు వచ్చి తింటుండగా.. కింద పడిపోయిన గింజలు వాటికి సరిపోతాయో లేదో అని నోటితో దాణాను కరుచుకొని కింద పడవేస్తూ వాటికి ఆహారం అందించింది. పావురాలు కూడా బెదిరిపోకుండా హాయిగా గింజలను తిన్నాయి.
Y les llamamos animales. pic.twitter.com/4gCnu9Nymt
— J. Tomás. (@JTomCorVi) March 17, 2023
గుర్రం తాను తినడమే కాక ఆ పావురాలకు కూడా తన ఆహారాన్ని పంచుతున్న ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Figen అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను 2.3 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు మరియు 62 వేల మందికి పైగా లైక్ చేసారుమనుషులకంటే జంతువులే బెటర్ అంటూ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..