Black Grapes Price: నల్ల ద్రాక్ష ఖరీదెక్కువ..! ఎందుకో తెలుసా..? కారణం తెలిస్తే నోరెళ్ల బెడతారు..

దీంతో పంట సేకరణకు అధిక సమయం పడుతుంది. నల్లద్రాక్ష ప్యాకింగ్ కూడా చాలా భిన్నంగా చేయాల్సి ఉంటుంది. అది దాని ధర పెరుగుదలకు కూడా కారణమవుతుంది. ధర పెరగడానికి మరొక కారణం నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు.

Black Grapes Price: నల్ల ద్రాక్ష ఖరీదెక్కువ..! ఎందుకో తెలుసా..? కారణం తెలిస్తే నోరెళ్ల బెడతారు..
Black Grapes Are Costly
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2023 | 1:26 PM

మనలో చాలా మంది ద్రాక్షపండ్లంటే ఎక్కువ ఇష్టపడతారు. కానీ, మార్కెట్‌లో నల్ల ద్రాక్ష ధర, పచ్చ ద్రాక్ష కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే, దాని రుచి కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది, కానీ, ఆ కొద్దిపాటి రుచి తేడా ధరను కూడా ప్రభావితం చేస్తుందా? లేక ఈ పండు ఖరీదు కావడానికి మరేదైనా కారణం ఉందా…? అనేది ఎప్పుడైనా ఆలోచించారా..? అసలింతకీ నల్ల ద్రాక్షలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..

నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైనది?

నల్ల ద్రాక్ష ధర ఆకుపచ్చ ద్రాక్ష కంటే ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నల్ల ద్రాక్ష పంట దిగుబడి ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది. నల్ల ద్రాక్షను కొన్ని పరిస్థితులలో మాత్రమే పండించగలుగుతారు. దీని కోసం ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రత్యేక నేల అవసరం. చల్లని, చాలా వేడి వాతావరణంలో నల్ల ద్రాక్షను సాగు చేయలేరు. నల్ల ద్రాక్షకు సాపేక్షంగా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఖర్చు, దిగుబడి ఈ గణన కారణంగా నల్ల ద్రాక్ష ధర పెరుగుతుంది. దీంతో పంట సేకరణకు అధిక సమయం పడుతుంది. నల్లద్రాక్ష ప్యాకింగ్ కూడా చాలా భిన్నంగా చేయాల్సి ఉంటుంది. అది దాని ధర పెరుగుదలకు కూడా కారణమవుతుంది. నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్షకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ, దాని సరఫరా డిమాండ్‌ను తీర్చలేకపోతుంది. దీంతో వినియోగదారుల జేబులపై భారం పడక తప్పటం లేదు.. ఇది కాకుండా, నల్ల ద్రాక్షను సాధారణంగా చేతులతో జాగ్రత్తగా తెంపాల్సి ఉంటుంది. అదే పనిని యంత్రం ద్వారా చేస్తే దాని ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి. దీంతో పంట సేకరణకు అధిక సమయం పడుతుంది. నల్లద్రాక్ష ప్యాకింగ్ కూడా చాలా భిన్నంగా చేయాల్సి ఉంటుంది. అది దాని ధర పెరుగుదలకు కూడా కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

ధర పెరగడానికి మరొక కారణం నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు. నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లతో పాటు అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ సహాయంతో చర్మం, జుట్టు అందం పెరుగుతుంది. కంటి చూపు బలహీనంగా ఉన్నవారు కూడా ఈ పండు తినడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం…