Optical Illusion: హలో బాస్.. మీ కళ్లలో పవర్ ఉంటే ఇందులో ఉన్న వ్యక్తిని కనిపెట్టండి చూద్దాం..
సోషల్ మీడియా ప్రపంచం.. ఎన్నో వింతలకు ప్రసిద్ధి.. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లకు సవాల్ చేస్తూ గజిబిజి చేస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచం.. ఎన్నో వింతలకు ప్రసిద్ధి.. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లకు సవాల్ చేస్తూ గజిబిజి చేస్తుంటాయి. అయితే, ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ.. మన కళ్లను మోసం చేసేలా కనిపిస్తుంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలలో దాగి ఉన్న వాటిని పరిష్కరించడం అనేది.. చాలా మందికి సాధ్యం కాదు. అయితే, తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఉన్న విషయాలను గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్ గా ఉన్నట్లు అర్ధం.. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ ను ఇష్టపడుతుంటారు. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బొమ్మల మధ్య దాగి ఉన్న మనిషిని కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది.
వాస్తవానికి, ఇటీవల ఈ చిత్రం సోషల్ మీడియాలో కనిపించినప్పటి నుంచి మేధావులందరూ ఈ కఠినమైన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. అయితే, టార్గెట్ ను మాత్రం రీచ్ అవ్వడంలో కాస్త విఫలమయ్యారు. విగ్రహాలు ఉన్న ఈ చిత్రంలో ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కూడా పూర్తిగా విగ్రహాల మాదిరిగా పెయింట్ చేసి.. అతను ఎక్కడున్నాడో గుర్తు పట్టాలి. దీనిలో మరో ట్విస్ట్ కూడా దాగుంది. సరైన సమాధానం కేవలం ఐదు సెకన్లలో ఇస్తే.. మీరు ఇంటిలిజెండ్ అని పేర్కొంటున్నారు.
వాస్తవానికి ఈ చిత్రంలో కొంతమంది నిలబడి ఉండగా.. కొందరు కూర్చున్న విధంగా సెట్ చేశారు. ఇది చాలా పాతది.. దీనిలో విగ్రహాలు.. తమను తాము మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ విగ్రహాల మధ్య నిలబడిన నిజమైన మనిషి చుట్టూ అనేక విగ్రహాలు ఉన్నాయి. వాటి మధ్య దాగున్న ఆ వ్యక్తిని కనిపెట్టారా..? లేకపోతే మరోసారి ట్రై చేయండి..
ఈ చిత్రం పరిష్కరించడం చాలా సులభం. మీరు జాగ్రత్తగా చూస్తే, చిత్రం వెనుక ఒక వ్యక్తి చేతిలో గడియారం కట్టి, దానిని చూస్తున్నాడు. ఈ చిత్రంలో అతను నిజమైన వ్యక్తి.. మిగిలినవన్నీ విగ్రహాలు. ఈ చిత్రాన్ని అందరూ కనిపెట్టలేని విధంగా సెట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..