- Telugu News Photo Gallery Sports photos Here are the list of medals that Nikhat Zareen won for India in her career upto IBA World Championships 2023 Gold Medal
Nikhat Zareen: భారత్ తరఫున నిఖత్ గెలిచిన పతకాలివే.. ‘బాక్సింగ్ చాంపియన్’ మెడల్స్ లిస్టు కొంచెం పెద్దదే..!
భారత్ తరఫున మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ స్వర్ణ పతకాలు అందుకున్న బాక్సర్‌గా నిలిచింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. గతేడాది కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణం , తాజాగా ఢిల్లీలో జరుగుతున్న బాక్సింగ్ చాంపియన్షిప్‌లో మరో స్వర్ణం సాధించింది నిఖత్. అయితే నిఖత్ తన కెరీర్‌లో ఇవే కాక మరెన్నో స్వర్ణాలను, ఇతర పతకాలను సొంతం చేసుకుంది.
Updated on: Mar 26, 2023 | 7:55 PM

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో.. తెలుగమ్మాయి నిఖత్ జరీన్ 5-0 తేడాతో వియత్నాం బాక్సర్ న్యూయెన్ టి తామ్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ దిగ్గజ బాక్సర్ మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు బంగారు పతకాన్ని అందుకున్న ఇండియన్ బాక్సర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

అంతకముందు అంటే గతేడాది జరిగిన 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా నిఖత్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడు కూడా ఆమె 5-0 తేడాతోనే నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌నాల్‌ని ఓడించి విజేతగా నిలిచింది.

అయితే నిఖత్ తన కెరీర్‌లో ఇవే కాక మరెన్నో స్వర్ణాలను, ఇతర పతకాలను సొంతం చేసుకుంది. మరి ఈ క్రమంలో ఆమె ఎప్పుడు, ఏ పతకాన్ని అందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2011: ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2014: నేషన్స్ కప్ టోర్నమెంట్‌లో స్వర్ణం

2015: జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2018: సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం

2019: థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో రజతం

2019, 2022: స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో పసిడి పతకం

2022: ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా గతేడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా నిఖత్ స్వర్ణం గెలిచింది. అందుకోసం ఆమె 5-0 తేడాతో ఐర్లాండ్ మహిళా బాక్సర్‌ని మట్టికరిపించింది.

2023: తాజాగా ఢీల్లీ వేదికగా జరుగుతున్న ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చైనాపై స్వర్ణం. ఇందుకోసం ఆమె ఇప్పుడు కూడా 5-0 తేడాతో చైనా మహిళా బాక్సర్‌ని ఓడించింది.





























