- Telugu News Photo Gallery Cricket photos List of IPL cricketers who have scoped 20 Plus runs in an over for most of the times
IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. బరిలోకి దిగితే బౌలర్లకు చుక్కలు ఖాయం.. లిస్టులో ఆ జట్టు ప్లేయర్లదే హవా..
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఇక ఐపీఎల్ అంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠ పోరు సాగటం అనేది సర్వసాధారణం. ఒకే ఓవర్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన బ్యాట్స్‌మెన్ ఐపీఎల్‌లో చాలా మందే ఉన్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 27, 2023 | 6:49 AM

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 20కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడిన ఈ యూనివర్సల్ బాస్ ఏకంగా 27 సార్లు ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు చేసిన ఘనతను అందుకున్నాడు.

ఇక ఈ జాబితాలో వెస్ట్ ఇండీస్‌కి చెందిన మరో క్రికెటర్ కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. 189 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఇండియన్ ప్లేయర్ 13 సార్లు ఈ ఫీట్ సాధించాడు.

అత్యధికంగా 20కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో కూడా వెస్ట్ ఇండీస్‌కి చెందిన ప్లేయరే ఉన్నాడు. అవును, ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఆండ్రీ రస్సెల్.. 10 సార్లు ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు చేశాడు.

ఈ లిస్ట్ 4వ స్థానంలో ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ 9 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.

టాప్ 5 స్థానంలో ముంబై ఇండియన్స్‌ని 5 సార్లు టోర్నీ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 227 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్.. 8 సార్లు ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు చేశాడు.

ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు. అవును, మొత్తం 234 మ్యాచ్‌లు ఆడిన ధోని కూడా 8 సార్లే ఈ ఘనతను సాధించాడు.





























